MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నిర్మితమవుతున్న ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం పూర్తిగా లాంగ్ హెయిర్ పెంచిన మహేష్ బాబు మేకోవర్ పరంగా కూడా పలు మార్పులు చేశారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ మాట్లాడే స్లాంగ్ తో పాటు ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని అలానే హీరోయిన్ గా నటిస్తునsarkaru vaari paata;mahesh babu;cbn;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;tara;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;audience;heroine;mythri movie makers;dubaiమహేష్ బాబుకి మదర్ దొరికేశారోచ్ ... ??మహేష్ బాబుకి మదర్ దొరికేశారోచ్ ... ??sarkaru vaari paata;mahesh babu;cbn;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;tara;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;audience;heroine;mythri movie makers;dubaiMon, 22 Mar 2021 22:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నిర్మితమవుతున్న ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం పూర్తిగా లాంగ్ హెయిర్ పెంచిన మహేష్ బాబు మేకోవర్ పరంగా కూడా పలు మార్పులు చేశారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ మాట్లాడే స్లాంగ్ తో పాటు ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని అలానే హీరోయిన్ గా నటిస్తున్న కీర్తిసురేష్ ఇందులో ఒక బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపించనుందని అంటున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ మది కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో జరురగా అతి త్వరలో రెండో షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేస్తోంది యూనిట్. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ఒక బ్యాంకు ఉద్యోగి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నారని అంటున్నారు. అలానే ఆయన తల్లిగా ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి ఒకరు ఇటీవల ఎంపికయ్యారని ఇప్పటికే సదరు నటితో సర్కారు వారి పాట యూనిట్ ఒప్పందం కూడా చేసుకుందని అతి త్వరలో ఆమె కాల్షీట్స్ కూడా తీసుకోనుందని అంటున్నారు.

దీనిపై రాబోయే రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. మరి ఇంతకీ ఎవరా నటి ఎప్పుడు ఆమె షూటింగ్ లో జాయిన్ అవుతారు అనేటువంటి పూర్తి విషయాలపై క్లారిటీ రావాలంటే సర్కారు వారి పాట యూనిట్ నుంచి అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


వైష్ణవ్ తేజ్ తో త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యడా,,??

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>