MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film45af4246-78a7-4fb7-9780-e3d5971796f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film45af4246-78a7-4fb7-9780-e3d5971796f7-415x250-IndiaHerald.jpgఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేయనుంది. నిర్మాత డి.వి.వి. దానయ్య రూ. 350-400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉండి పోయింది. దీనికి కారణం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగి పోవడమే అని చెప్పుకోవచ్చు. అలాగే రాజమౌళి తన ప్రతి చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా సమయం తీసుrrr film;business;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;media;tamil;producer;kannada;hindi;october;producer1;posters;march;indian;v;coronavirus;chitramరికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్..రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్..rrr film;business;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;media;tamil;producer;kannada;hindi;october;producer1;posters;march;indian;v;coronavirus;chitramMon, 22 Mar 2021 15:00:00 GMTరాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేయనుంది. నిర్మాత డి.వి.వి. దానయ్య రూ. 350-400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉండి పోయింది. దీనికి కారణం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగి పోవడమే అని చెప్పుకోవచ్చు. అలాగే రాజమౌళి తన ప్రతి చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా సమయం తీసుకుంటారు. దీనివల్ల రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు.


ఐతే అక్టోబర్ 13వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఐతే సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఫ్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లలో జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ తో పాటు సాటిలైట్ రైట్స్ 225 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క తెలుగు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సాటిలైట్, డిజిటల్ హక్కులను 225 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి.


నిజానికి భారత దేశ చరిత్రలో ఏ సినిమా కూడా కేవలం డిజిటల్, సాటిలైట్ హక్కుల ద్వారా వందల కోట్లలో డబ్బులు సంపాదించలేదు. కానీ రాజమౌళి చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డును మరేతర ఇండియన్ సినిమా బ్రేక్ చేయలేదేమో. ఇకపోతే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్, అజయ్ దేవగన్, చరణ్, తారక్ నటిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ. 500 కోట్లు దాటిందని సమాచారం. దీంతో ఈ సినిమా విడుదల కాకముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది. మరి విడుదలైతే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో? చూడాలి.


రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన జాతి రత్నాలు.....

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>