SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/yuvraj-yusuf-win-road-safety-seriesb0a5b281-c81c-44e4-98c8-0aa450295145-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/yuvraj-yusuf-win-road-safety-seriesb0a5b281-c81c-44e4-98c8-0aa450295145-415x250-IndiaHerald.jpg రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లోనూ చెలరేగారు. ఆదివారం జరిగిన అంతిమ సమరంలో శ్రీలంక లెజెండ్స్‌ను 14 పరుగులతో ఓడించి విజేతలుగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా యువరాజ్, యూసఫ్ పఠాన్ ల మెరుపులతో భారీ స్కోర్ నమోదు చేసింది. . యూసుఫ్‌ పఠాన్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్‌), యువరాజ్‌ సింగ్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60), సచిన్ ( 23 బంతుల్లో 5ఫోర్లతో 30) పరుగులు చేయడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల లక్షsports news;sachin;sachin tendulkar;jayasurya music;varsha;cricket;india;sri lanka;west indies;twitter;letter;dookudu;oscar;master;paruguచెలరేగిన యువరాజ్, యూసఫ్..రోడ్ సేఫ్టీ సిరీస్ కైవసం !!చెలరేగిన యువరాజ్, యూసఫ్..రోడ్ సేఫ్టీ సిరీస్ కైవసం !!sports news;sachin;sachin tendulkar;jayasurya music;varsha;cricket;india;sri lanka;west indies;twitter;letter;dookudu;oscar;master;paruguMon, 22 Mar 2021 10:42:18 GMT రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లోనూ చెలరేగారు. ఆదివారం జరిగిన అంతిమ సమరంలో శ్రీలంక లెజెండ్స్‌ను 14 పరుగులతో ఓడించి విజేతలుగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా యువరాజ్, యూసఫ్ పఠాన్ ల మెరుపులతో భారీ స్కోర్ నమోదు చేసింది. . యూసుఫ్‌ పఠాన్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్‌), యువరాజ్‌ సింగ్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60), సచిన్ ( 23 బంతుల్లో 5ఫోర్లతో 30) పరుగులు చేయడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. 

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ 20 ఓవర్లలో 167/7 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు సనత్‌ జయసూర్య (35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), తిలకరత్నే దిల్షాన్‌ (18 బంతుల్లో 3 ఫోర్లతో 21) మెరుపు ఆరంభాన్నిచ్చారు. చివర్లో వీరరత్నే (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో రోడ్ సేఫ్టీ సిరీస్ ఇండియా లెజెండ్స్ కైవసం అయ్యింది. దీంతో ఇండియా లెజెండ్స్ పై ప్రశంశల వర్షం కురుస్తుంది. 

ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రజల్లో రోడ్ సేఫ్టీ పై అవగాహన కలిగించేందుకు 50 సెకన్ల నిడివి కలిగిన షార్ట్ వీడియో ను పోస్ట్ చేశారు. క్రికెట్ ఆడేటప్పుడైనా, రోడ్ పై వెళ్ళే తప్పుడైనా హెల్మెంట్ చాలా ముఖ్యం అని ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ఉపయోగించాలని సచిన్ సూచించాడు..వీడియోతో తనతో పాటు నటించినందుకు లారా కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఈ వీడియోను స‌చిన్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయ‌గా.. ఆస్కార్ నామినేష‌న్ అంటూ కామెంట్ జోడిస్తూ దానిని యువ‌రాజ్‌సింగ్ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
" style="height: 370px;">



ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>