HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/teethf45f83c5-9005-4b26-ae85-9c7874f3a35a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/teethf45f83c5-9005-4b26-ae85-9c7874f3a35a-415x250-IndiaHerald.jpgదంతాల సమస్యతో చాలా మంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు. పళ్ళు పుచ్చిపోయి పంటి నొప్పి సమస్యలు వస్తుంటాయి. ఆ పంటి నొప్పి సమస్యలని తగ్గించుకోడానికి ఈ పద్ధతులు పాటించండి.ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఐస్ ముక్కలను వేసి పలుచటి గుడ్డతో చుట్టండి. నొప్పిగా ఉన్న పంటిపై మీద ఈ బ్యాగ్‌తో నెమ్మదిగా ఒత్తితే నొప్పి తగ్గుతుంది. వాపు కారణంగా వచ్చిన నొప్పిని తగ్గించడంలో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవడం తదితర జాగ్రత్తలతో దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరీ చల్లగTeeth;oil;garlic;saltఆరోగ్యకరమైన దంతాలు కోసం ఈ గృహ చిట్కాలు పాటించండి....ఆరోగ్యకరమైన దంతాలు కోసం ఈ గృహ చిట్కాలు పాటించండి....Teeth;oil;garlic;saltMon, 22 Mar 2021 00:00:00 GMTదంతాల సమస్యతో చాలా మంది అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు. పళ్ళు పుచ్చిపోయి పంటి నొప్పి సమస్యలు వస్తుంటాయి. ఆ పంటి నొప్పి సమస్యలని తగ్గించుకోడానికి ఈ పద్ధతులు పాటించండి.ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఐస్ ముక్కలను వేసి పలుచటి గుడ్డతో చుట్టండి. నొప్పిగా ఉన్న పంటిపై మీద ఈ బ్యాగ్‌తో నెమ్మదిగా ఒత్తితే నొప్పి తగ్గుతుంది. వాపు కారణంగా వచ్చిన నొప్పిని తగ్గించడంలో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవడం తదితర జాగ్రత్తలతో దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరీ చల్లగా ఉండే ద్రవాలను తాగకపోవడం మరింత మంచిది.వెల్లుల్లిలో ఉండే యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లిని బాగా దంచి.. టేబుల్ సాల్ట్ లేదా మిరియాలతో కలిపి నొప్పి కలిగిస్తున్న పంటిపై ఉంచండి. దీని వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. లేదా వెల్లుల్లి రెబ్బలను నమలినా నొప్పి తగ్గుతుంది. దంచిన వెల్లులితోనే ఎక్కువ ఫలితం ఉంటుంది.




లవంగాలతో పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే పంటి వద్ద లవంగాన్ని ఉంచి కొద్దికొద్దిగా నమలాలి. దీని వల్ల అందులో నుంచి నూనె విడుదలై పంటి నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గించేందుకు లవంగ నూనె కూడా ఉపయోగించవచ్చు. దూదిపై రెండు చుక్కలు లవంగ నూనె వేసి నొప్పి వచ్చే దంతాలపై ఉంచాలి.వేడి నీటిలో కాస్త ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు కరిగిన తర్వాత ఆ నీటిని నోటిలో వేసుకుని పుక్కిలించండి. ఈ ద్రావణం సహజమైన యాంటి సెప్టిక్‌లా పని చేస్తుంది. కనీసం 30 సెకన్లపాటు ఉప్పు నీటిని పుక్కిలించండి. దీనివల్ల దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. ఇన్ఫెక్షన్లు కూడా పెరగవు. నొప్పి ఎక్కువగా ఉంటే వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించండి.ఈ పద్ధతులు పాటిస్తే మీ దంతాలు ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.



హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>