PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-hot-comments45f19d5f-36ca-426b-90de-647b8204a861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-hot-comments45f19d5f-36ca-426b-90de-647b8204a861-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ లో తిరుగుబాటు జరగనుందా? మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి బయటికి రానున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గతంలో తన కామెంట్లలో కాక రేపిన మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలనానిరి తెర తీశారు.ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయవచ్చని రాజకీయ వర్గాల్లో భావిస్తున్నాయి.etela rajender hot comments;kcr;dharma;ramu;tiru;telangana rashtra samithi trs;eatala rajendar;mahabharatham;minister;etela rajender;party;prasthanamటీఆర్ఎస్ పై ఈటల తిరుగుబాటు?టీఆర్ఎస్ పై ఈటల తిరుగుబాటు?etela rajender hot comments;kcr;dharma;ramu;tiru;telangana rashtra samithi trs;eatala rajendar;mahabharatham;minister;etela rajender;party;prasthanamMon, 22 Mar 2021 08:59:05 GMTటీఆర్ఎస్ లో తిరుగుబాటు జరగనుందా? మంత్రి ఈటల రాజేందర్పార్టీ నుంచి బయటికి రానున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గతంలో తన కామెంట్లలో కాక రేపిన మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలనానిరి తెర తీశారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక రైతు వేదికను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో  ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలని ‌అన్నారు ఈటల రాజేందర్.  ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని చెప్పారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని తెలిపారు రాజేందర్.

‘‘ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లికి ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది.  రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.’’ అని మంత్రి ఈటల తెలిపారు.

కొంత కాలంగా టీఆర్ఎస్ లో రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల క్రితం గులాబీ జెండాకు తామే ఓనర్లమన్న ఈటల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనమయ్యాయి. కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు చేస్తారనే చర్చ జరిగింది. అయితే ఆ వివాదం అక్కడితోనే ముగిసిపోయింది. అయినా పార్టీ కార్యక్రమాల్లో గతంలో లాగా చురుకుగా పాల్గొనడం లేదు ఈటల. తన మంత్రిత్వ శాఖ వరకే పరిమితమవుతున్నారు. తాజాగా తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్న వ్యాఖ్యలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్టీలో తాను గాయపడినట్లు రాజేందర్ చెప్పారని అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఈటలను గాయపరిచింది ఎవరూ అన్న చర్చ జరుగుతోంది. రాజేందర్ కామెంట్లపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయవచ్చని రాజకీయ వర్గాల్లో భావిస్తున్నాయి.


ఆ ఎమ్మెల్సీ విషయంలో బాబు మరో తప్పు...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>