Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/south-africa-women-cricketer-praised-indian-spinner-ashwin-for-supporting-thembe97ce7b-90b1-45e7-a7c8-8c6e180a2fa6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/south-africa-women-cricketer-praised-indian-spinner-ashwin-for-supporting-thembe97ce7b-90b1-45e7-a7c8-8c6e180a2fa6-415x250-IndiaHerald.jpgఅమ్మాయిల క్రికెట్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ చేశాడు. అశ్విన్ చేసిన ట్వీట్‌కు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అదే స్థాయలో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా, ఇండియా మహిళా జట్ల మధ్య ఆదివారం రెండో టీ20..ashwin;cricket;audi;india;south africa;korea, south;naga aswin;twitter;icc t20;paruguఅమ్మాయిల క్రికెట్‌పై అశ్విన్ ట్వీట్.. అదే స్థాయిలో జవాబిచ్చిన మహిళా క్రికెటర్అమ్మాయిల క్రికెట్‌పై అశ్విన్ ట్వీట్.. అదే స్థాయిలో జవాబిచ్చిన మహిళా క్రికెటర్ashwin;cricket;audi;india;south africa;korea, south;naga aswin;twitter;icc t20;paruguMon, 22 Mar 2021 19:05:21 GMTఇంటర్నెట్ డెస్క్: అమ్మాయిల క్రికెట్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ చేశాడు. అశ్విన్ చేసిన ట్వీట్‌కు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అదే స్థాయలో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా, ఇండియా మహిళా జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా మహిళలపై సౌత్‌ఆఫ్రికా మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు. `లౌరాను ఎలా అవుట్ చేయాలి? అమెకు సాఫ్ట్ సిగ్నల్ పంపించాలా?` అని ఆ ట్వీట్ రాసుకొచ్చాడు. అలాగే లౌరా ఆటను ప్రశంసించాడు.

అశ్విన్ చేసిన ట్వీట్‌పై ఇంగ్లండ్ ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు అలగ్జాండ్రా హార్ట్‌లే స్పందించింది. మహిళల క్రికెట్‌ మ్యాచ్‌పై అశ్విన్ చూపిస్తున్న ఆసక్తిని ప్రశంసించింది. `ఇదే మేం కోరుకునేది. అన్నింటికంటే ఇదే ముఖ్యమైనది కూడా. మహిళల ఆటపై నిజమైన ఆసక్తి కనబర్చిన అశ్విన్‌కు ధన్యవాదాలు` అని అలెంగ్జాండ్రా తన ట్వీట్‌లో పేర్కొంది. వీరిద్దరి ట్వీట్లపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
     
ఇదిలా ఉంటే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌‌లో టీమిండియా మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ధాటిగా ఆడి మ్యాచ్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ ఉమన్ లౌరా వోల్వార్ట్ 39 బంతుల్లోనే 53 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.  చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. అంతకుముందు శనివారం జరిగిన తొలి టీ20లో కూడా టీమిండియా మహిళల జట్టుపై సౌత్‌ఆఫ్రికా విజయం సాధించింది.

">
" style="height: 263px;">







జ‌క్క‌న్న పై ట్రోల్స్..రెడ్ బ్లౌజ్ గ్రీన్ శారీల‌నే వాడ‌తారా.?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>