Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma021814cf-59b6-462e-a90a-55e5b591dee7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma021814cf-59b6-462e-a90a-55e5b591dee7-415x250-IndiaHerald.jpgఐదో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. రోహిత్‌ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చి ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఉచకోత కోశారు. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్‌లను పక్కనపెట్టిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో తానే ఓపెనర్ అవతారం ఎత్తాడు. రోహిత్‌తో కలిసి సూపర్ పార్ట్‌నర్‌షిప్ ఇచ్చాడు. వీరిద్దరూ యథేచ్ఛగా బౌండరీలు బాదుతూ..rohit sharma;ishaan actor;rahul new;rahul;rani;rohit;virat kohli;k l rahul;rahul sipligunj;icc t20;parugu‘కోహ్లీ ఓపెనింగ్ వస్తే నాకేంటి..? ’‘కోహ్లీ ఓపెనింగ్ వస్తే నాకేంటి..? ’rohit sharma;ishaan actor;rahul new;rahul;rani;rohit;virat kohli;k l rahul;rahul sipligunj;icc t20;paruguSun, 21 Mar 2021 14:58:17 GMTఇంటర్నెట్ డెస్క్: ఐదో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. రోహిత్‌ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చి ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఉచకోత కోశారు. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్‌లను పక్కనపెట్టిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో తానే ఓపెనర్ అవతారం ఎత్తాడు. రోహిత్‌తో కలిసి సూపర్ పార్ట్‌నర్‌షిప్ ఇచ్చాడు. వీరిద్దరూ యథేచ్ఛగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి వికెట్‌కు ఏకంగా 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్(64: 34 బంతుల్లో) అవుటైనా కోహ్లీ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. అయితే కోహ్లీ ఓపెనింగ్ రావడంపై రోహిత్ స్పందించాడు.

కోహ్లి ఓపెనర్‌గా వస్తే తనకేమీ అభ్యంతరం లేదని, మ్యాచ్‌ గెలవాలనే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటామని రోహిత్ చెప్పాడు. ‘కోహ్లి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తా. జట్టుకు అవసరమైన దశలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి బ్యాట్స్‌మన్ సిద్ధంగా ఉండాలి. అదే కోహ్లి చేశాడు.. తాను ఓపెనర్‌గా రాణించగలనన్న నమ్మకం కోహ్లికి ఉంది. అదే అతడికున్న అదనపు బలం. జట్టు సారథి ఇలా ఉంటేనే మ్యాచ్‌లు గెలవగలం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

బయట ఏం అనుకుంటున్నారనేది తమకు అనవసరమని, ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలో, ఎవరు ఆడకూడదో నిర్ణయించే హక్కు ఎప్పుడూ కెప్టెన్‌కు ఉంటుందని రోహిత్ అన్నాడు. ‘ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఓపెనింగ్ చేసినా, వన్‌డౌన్‌లో వచ్చినా అతడి ఆటలో మార్పు రాదు కదా..? ఇషాన్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యాడు.. కోహ్లి కూడా సక్సెస్‌ అయ్యాడు. జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి ఆ నిర్ణయం తీసుకున్నాడ’ని పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం టీమిండియా దృష్టంతా రాబోయే టీ20 ప్రపంచకప్‌పైనే ఉందని, ఐపీఎల్‌ ముగిసిన తర్వాత పూర్తిగా దానిపైనే దృష్టి సారించనున్నామని రోహిత్ అన్నాడు. అందుకే అన్ని రకాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు వివరించాడు.

కాగా టీమిండియా ఐదో టీ20లో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగినా ఓపెనర్లు కోహ్లీ, రోహిత్‌ అదిరిపోయే ఆటతీరుతో టీమిండియా 224 భారీ స్కోరు చేసింది. అనంతరం భువనేశ్వర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. దీంతో టీమిండియా మ్యాచ్‌ గెలుచుకోవడమే కాకుండా సిరీస్ కూడా కైవసం చేసుకుంది.


అనిల్ రావిపూడి ఆ సెంటిమెంట్.. మరోసారి నిరాశే మిగిల్చిందా..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>