MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/theatres-movie-theatres-tollywood-cb7fe9cf-a2c2-4cc7-903c-b01c327d0c49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/theatres-movie-theatres-tollywood-cb7fe9cf-a2c2-4cc7-903c-b01c327d0c49-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మొదలైన తర్వాత ఇప్పటి వరకూ ఒకరోజు అత్యథిక కేసులు శనివారం నమోదయ్యాయి. తొలి దశ కంటే రెండో దశ మరింత ప్రభావం చూపుతోందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేమీ అక్కర్లేదు. మొత్తం దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో 62శాతం కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తారని థియేటర్లు, స్కూల్స్ మూత పడతాయని అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే.. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటtheatres, movie theatres, tollywood,;business;kcr;amala akkineni;maharashtra - mumbai;cinema theater;maharashtraతెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసేస్తారా..?తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసేస్తారా..?theatres, movie theatres, tollywood,;business;kcr;amala akkineni;maharashtra - mumbai;cinema theater;maharashtraSun, 21 Mar 2021 11:00:00 GMTమహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తారని థియేటర్లు, స్కూల్స్ మూత పడతాయని అంటున్నారు. ఈ వార్తలు నిజమైతే.. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడంతో స్కూల్స్ తెరచి ఉంచడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం కేసీఆర్. కేసుల సంఖ్య పెరిగితే స్కూల్స్ మూసివేసి, కేవలం పదో తరగకి విద్యార్థులకు మాత్రమే ప్రత్యక్ష తరగతులు పెడతారని అంటున్నారు. అదే జరిగితే.. స్కూల్స్ మూసివేసి, థియేటర్లు తెరవడాన్ని ఎవరూ హర్షించరు. అంటే అనివార్యంగా థియేటర్లు కూడా మూతబడే అవకాశముంది.

ఓటీటీని తప్పించుకుని ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. ఇంతలోనే సెకండ్ వేవ్ కారణంతో థియేటర్లు మూసివేస్తే.. నిర్మాతలు ఇబ్బంది పడతారు. అందులోనూ వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లపై ప్రకటనలు వెలువడ్డాయి. దర్శకనిర్మాతలంతా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈపాటికే చాలా చోట్ల థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ లు పూర్తయ్యాయి. ఈ దశలో థియేటర్లకు మూతపడితే అది నిర్మాతలకు పెద్ద షాకే. అందుకే తెలుగు నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది.

ముంబైలో థియేటర్లకు మూత పడితే మాత్రం కచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కూడా థియేటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అదే నిజమైతే మరోసారి సినీ ఇండస్ట్రీకి కష్టాలు తప్పవనమాట. గతంలో లాక్ డౌన్ విధించిన కాలంలో సినీ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరోసారి థియేటర్లు మూతపడి, షూటింగ్ లకు బ్రేక్ పడితే.. కార్మికుల కష్టాలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది.


కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>