MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh408ab6ef-d498-44ce-be19-08c1c96d150a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh408ab6ef-d498-44ce-be19-08c1c96d150a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సినిమా సరిలేరు నీకెవ్వరు గత ఏడాది సంక్రాంతి సమయంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు మహేష్ నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ కొట్టడం అనంతరం సరిలేరు సక్సెస్ తో ఏకంగా కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు మహేష్. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూmahesh-babu;ss rajamouli;mahesh;suresh;anil music;anil ravipudi;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;maharshi;parasuram;ram pothineni;rajamouli;thaman s;makar sakranti;india;south africa;sri bharath;rrr movie;cinema;rajani kanth;sankranthi;amazon;maharshi 1;blockbuster hit;heroine;success;yuva;mythri movie makersరాజమౌళి దెబ్బకు తలలు పట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ ...??రాజమౌళి దెబ్బకు తలలు పట్టుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ ...??mahesh-babu;ss rajamouli;mahesh;suresh;anil music;anil ravipudi;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;maharshi;parasuram;ram pothineni;rajamouli;thaman s;makar sakranti;india;south africa;sri bharath;rrr movie;cinema;rajani kanth;sankranthi;amazon;maharshi 1;blockbuster hit;heroine;success;yuva;mythri movie makersSun, 21 Mar 2021 22:48:03 GMTసూపర్ స్టార్ మహేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సినిమా సరిలేరు నీకెవ్వరు గత ఏడాది సంక్రాంతి సమయంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు మహేష్ నటించిన భరత్ అనే నేను, మహర్షి సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ కొట్టడం అనంతరం సరిలేరు సక్సెస్ తో ఏకంగా కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు మహేష్. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎంతో భారీగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్ర పోషిస్తున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత సర్కారు వారి పాట భారీ విజయాన్ని అందుకుని ఆయన ఖాతాలో మరొక సక్సెస్ ని నమోదు చేయడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత రాజమౌళితో మహేష్ ఒక భారీ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పై కథకుడు విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా లోని అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్లో ఉంటుందని భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అందరిలోనూ కొంత ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్సినిమా తరువాత మరొక యువ దర్శకుడితో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు టాక్. మరోవైపు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి అది పూర్తయిన తర్వాత కొంత విరామం తీసుకుని ఆపై వచ్చే ఏడాది ఏప్రిల్ లో మహేష్ మూవీ మొదలెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అసలు వచ్చే ఏడాది అయినా ఈ సినిమా మొదలు అవుతుందా లేదా అనే దానిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ హీరోతో రాజమౌళి సినిమా పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో ఏమో అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్ ఆ విషయమై కొంత తలలు పట్టుకుంటున్నారు. మరి ఇంతకీ ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో పక్కాగా తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు......!!  


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>