PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-vs-governor-officeab787508-5394-400c-bf27-1e3df9ca7e00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-vs-governor-officeab787508-5394-400c-bf27-1e3df9ca7e00-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం , కోర్టులకు వెళ్లడం ఇలా ఎన్నో వివాదాలు జరిగాయి.nimmagadda vs governor office;kumaar;andhra pradesh;botcha satyanarayana;panchayati;court;cbi;governor;local language;office;mantraగవర్నర్ ఆఫీసును టార్గెట్ చేసిన నిమ్మగడ్డ రమేష్...?గవర్నర్ ఆఫీసును టార్గెట్ చేసిన నిమ్మగడ్డ రమేష్...?nimmagadda vs governor office;kumaar;andhra pradesh;botcha satyanarayana;panchayati;court;cbi;governor;local language;office;mantraSun, 21 Mar 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం , కోర్టులకు వెళ్లడం ఇలా ఎన్నో వివాదాలు జరిగాయి. దానితో నిమ్మగడ్డ పబ్లిక్ లో బాగా ఫేమస్ అయిపోయారు. ఇక చివరికి సుప్రీం కోర్ట్ ఎన్నికలను జరపాల్సిందే అని చెప్పడంతో తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అన్ని విధాలుగా సహాయాలను అందించింది.

దీనితో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెద్దగా వివాదాలు లేకుండానే సజావుగా సాగిపోయాయి. ఇందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఇక మిగిలిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు నిమ్మగడ్డ మరో సంచలనానికి తెరతీశారు.  ఈసారి గవర్నర్ ఆఫిస్ నే టార్గెట్ చేయడం గమనార్హం. గవర్నర్ తో నిమ్మగడ్డ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమాచారం లీకవ్వడం, అలాగే తాను పెట్టిన సెలవులకు సంబంధించిన లేఖలు బయటకు రావడంపై సిబిఐ విచారణ జరిపించాలని హై కోర్టు లో పిటీషన్ వేశారు.

ఇందులో ప్రతి వాదులుగా గవర్నర్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రులు పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణ లను చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఈ విషయంపై ఇంత సీన్ చేయాల్సిన అవసరమైతే లేదంటున్నారు ప్రముఖులు. ఎందుకంటే నిమ్మగడ్డ గవర్నర్ పర్సనల్ సెక్రటరీ కాదు, అలాగని గవర్నర్ బంధువు కాదు. ఇలాంటివి దాచి ఉంచడానికి ఎటువంటి కారణం లేదు, గవర్నర్ ఆఫీసు ఖచ్చితంగా ఇలాంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇందులో ఎటువంటి తప్పు లేదు. అంతే కాకుండా ఇలాంటి విషయాలు కొన్ని సార్లు రాజకీయం వివాదం అవుతుంటాయి. మరి ఇప్పుడు ఈ పిటీషన్ విషయమై కోర్టు  ఏ విధంగా  స్పందిస్తుందో చూడాలి.


కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>