CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hindu-journalist-shot-dead-in-that-country-thugs-escape-police-blow-upd2f6925c-fd1e-4a66-b138-5607f1c96871-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/hindu-journalist-shot-dead-in-that-country-thugs-escape-police-blow-upd2f6925c-fd1e-4a66-b138-5607f1c96871-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ లో ఓ హిందూ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. పుచానో' అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన కూర్చుని ఉండగా.. ఓ కారులోను, రెండు బైక్ ల పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. dead;dilip kumar;kumaar;ajay;dileep;dileep kumar;dilip;pakistan;korcha;police;car;assembly;bike;air;murder.;father;hindus;shatru1ఆ దేశంలో హిందూ జర్నలిస్ట్ కాల్చివేత.. దుండగుల పరారీ.. పోలీసుల గాలింపు..!?ఆ దేశంలో హిందూ జర్నలిస్ట్ కాల్చివేత.. దుండగుల పరారీ.. పోలీసుల గాలింపు..!?dead;dilip kumar;kumaar;ajay;dileep;dileep kumar;dilip;pakistan;korcha;police;car;assembly;bike;air;murder.;father;hindus;shatru1Sun, 21 Mar 2021 10:00:00 GMTపాకిస్థాన్ లో ఓ హిందూ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. పుచానో' అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ  రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన  కూర్చుని ఉండగా.. ఓ కారులోను, రెండు  బైక్ లపై  వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లాల్వానీ  కడుపు, మోచేతులు, కాళ్లపై బుల్లెట్ గాయాలయయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయల్ న్యూస్ ఛానల్ కు, ఓఉర్దూ వార్తా పత్రికకు ఆయన రిపోర్టర్ గా పని చేస్తున్నారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు చెబుతుండగా..అలాంటిదేమీ లేదని, తమ కుమారుడికి శత్రువులెవరూ లేరని లాల్వానీ తండ్రి  దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. అజయ్ లాల్వానీ హత్యను పాక్ నేషనల్ అసెంబ్లీ లోని హిందూ సభ్యుడు లాల్ చంద్ మల్హీ తీవ్రంగా ఖండించారు. సింధ్ ప్రావిన్స్ లో హిందూ జర్నలిస్టులపై దాడులు, ఈ విధమైన హత్యలు  జరగడం దారుణమని, ఈ రాష్ట్రంలో తమకు భద్రత లేదని మీడియావారు భయపడుతున్నారని ఆయన సోషల్ మీడియాలో సందేశం పంపారు.

అయితే ఈ హత్యకు గల కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని, వృత్తి పరంగా లాల్వానీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అటు లాల్వానీ అంత్యక్రియలకు ఈ రాష్ట్రంలోని పలు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. పాకిస్థాన్ లో సుమారు 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.  వీరిని మైనారిటీ వర్గంగా పరిగణిస్తున్నారు. ఇలాగే సిక్కులు, క్రైస్తవులు కూడా ఇక్కడ మైనారిటీలే.


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండి అదే దారిలో..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>