MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrac5f0b59-d23a-469b-b031-df12e6514d0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrac5f0b59-d23a-469b-b031-df12e6514d0d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అందరూ జక్కన్న అని పిలుస్తారు. అమర శిల్పి జక్కన్న ఒక శిల్పాన్ని చెక్కడానికి యుగాలూ జగాలూ అయ్యేదిట. మరి మన టాలీవుడ్ దర్శక శిల్పి రాజమౌళి ఒక సినిమాను తీయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాడని ఆ విధంగా ఆయన‌కు పేరు పెట్టేశారు. అయితే ఆయన తీర్చి దిద్దిన శిల్పం మాత్రం అద్భుతం, అమోఘం. అందుకే జక్కన్న గ్రేట్ అంటారు. rrr;ntr;jr ntr;ooha;rajamouli;india;tollywood;rrr movie;cinema;bahubali;audience;director;thief;eega;nithin reddy;chatrapathi;donga;simhadriఅదిగో... రాజమౌళి ఊహాలోకం ?అదిగో... రాజమౌళి ఊహాలోకం ?rrr;ntr;jr ntr;ooha;rajamouli;india;tollywood;rrr movie;cinema;bahubali;audience;director;thief;eega;nithin reddy;chatrapathi;donga;simhadriSun, 21 Mar 2021 12:00:00 GMTటాలీవుడ్ లో అందరూ జక్కన్న అని పిలుస్తారు. అమర శిల్పి జక్కన్న ఒక శిల్పాన్ని చెక్కడానికి యుగాలూ జగాలూ అయ్యేదిట. మరి మన టాలీవుడ్ దర్శక శిల్పి రాజమౌళి ఒక సినిమాను తీయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాడని ఆ విధంగా ఆయన‌కు పేరు పెట్టేశారు. అయితే ఆయన తీర్చి దిద్దిన శిల్పం మాత్రం అద్భుతం, అమోఘం. అందుకే జక్కన్న  గ్రేట్ అంటారు.

ఇదిలా ఉంటే రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ మూవీ తీశారు. ఆ తరువాత సింహాద్రి తీశారు. విక్రమార్కుడు, ఛత్రపతి సినిమాల ద్వారా  సూపర్ హిట్లు  కొట్టారు. సై అంటూ నితిన్ తోనూ మంచి విజయం సాధించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన యమ దొంగ అంటూ జూనియర్ ఎన్టీయార్ తో ఒక మూవీ తీశారు. యమ లోకం అంటూ అందులో వండర్స్ ఎన్నో క్రియేట్ చేశారు. అలా రాజమౌళి ఊహాలోకం మొదలైంది.

ఆ తరువాత ఆయన మగధీరా తీశారు. ఇక నాటి నుంచి రాజమౌళి ఊహాలోకం లోనే విహరిస్తున్నారు అంటున్నారు. ఈగ సినిమా తీసినా బాహుబలి తీసినా ఇపుడు ఆర్.ఆర్.ఆర్ తీసినా రాజమౌళి కొత్త లోకాలను చూస్తున్నారు. వాటిలోకి ఆడియన్స్ ని ఆహ్వానిస్తున్నారు. రాజమౌళి ఇలా ఫిక్షన్ వెంట పడుతూ జనాలను మెస్మరైజ్ చేసే విధంగా మూవీస్ తీస్తూ అందులోనే లోతులు చూస్తున్నాడు అంటున్నారు.

విశేషమేంటి అంటే రాజమౌళి తీసిన ఈ ఊహాలోకపు సినిమాలను అన్నీ కూడా జనాలు విపరీతంగా మెచ్చుకుంటున్నారు. బ్లాక్ బస్టర్లు చేసి మరీ ఆదరిస్తున్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ మూవీలో కూడా ఇలా ఎన్నో మెరుపులు ఉంటాయని అంటున్నారు. రాజమౌళి ఇహ లోకం కంటే ఫ్లాష్ బ్యాక్ ల్లోకి తనకు మాత్రమే తెలిసిన ఊహా లోకాల్లోకి విహరించడం అలవాటు చేసుకున్నాడు అంటారు. ఎన్ని చేసినా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని రాజమౌళి ఈ రోజు పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలిచి గెలిచాడు. మొత్తానికి రాజమౌళి ఊహాలోకాన్ని వీడి రాలేడు అన్న మాట కూడా ఉంది. ఆయన తరువాత సినిమాలు కూడా అలాంటివే ఉంటాయని చెబుతున్నారు.




కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>