MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరుశురాం పెట్ల తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. మది ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తుండగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు ఇందులో కీలక పాత్రలు mahesh babu;sarkaru vaari paata;mahesh;ram charan teja;allu aravind;suresh;arvind swamy;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;bollywood;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;kollywood;audience;heroine;success;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainmentsమహేష్ సినిమా లో మెయిన్ విలన్ గా అతడు ఫిక్స్ .... ??మహేష్ సినిమా లో మెయిన్ విలన్ గా అతడు ఫిక్స్ .... ??mahesh babu;sarkaru vaari paata;mahesh;ram charan teja;allu aravind;suresh;arvind swamy;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;bollywood;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;kollywood;audience;heroine;success;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainmentsSun, 21 Mar 2021 23:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరుశురాం పెట్ల తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. మది ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తుండగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించే విధంగా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.
తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దుబాయిలో తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో గోవాలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీలైనంత వేగవంతంగా సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని పక్కాగా థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తుందని అంటున్నారు. కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఉద్యోగిని గా కనిపించనున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అరవిందస్వామి మెయిన్ విలన్ పాత్రకు ఇటీవల ఎంపికయ్యారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

హీరోతో పాటు ఢీ అంటే ఢీ అనేలా సాగే విలన్ క్యారెక్టర్ కోసం మొదట పలువురు నటులను పరిశీలించిన దర్శకుడు పరశురామ్ ఆ తర్వాత ఫైనల్ గా ఆ పాత్రకు అరవిందస్వామి అయితేనే పక్కాగా యాప్ట్ అవుతారని భావించి ఆయనని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అలానే ఇప్పటికే అరవింద్ స్వామి డేట్స్, కాల్షీట్స్ కూడా తీసుకున్నారని అతి త్వరలో ఆయన సర్కారు వారి పాట సెట్స్ లో జాయిన్ అవనున్నారని అంటున్నారు. ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ సినిమా లో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న అరవింద్ స్వామి తొలిసారిగా మహేష్ తో చేస్తున్న ఈ సర్కారు వారి పాట ద్వారా ఎంత వరకు ఆడియన్స్ ని అలరిస్తారో చూడాలి. మరి ఎప్పుడు ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలి అంటే సర్కారు వారి పాట యూనిట్ నుండి అఫీషియల్ న్యూస్ వెలువడే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>