CrimeChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/lady-cheat7bd27796-f2fa-449a-8584-59f443da49ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/lady-cheat7bd27796-f2fa-449a-8584-59f443da49ff-415x250-IndiaHerald.jpgఓ అమ్మాయి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది. అందరినీ ఒక్కసారే కాదు లెండి. ఒకరి తర్వాత ఒకరిని.. ఎందుకంటారా.. అదేమీ ఆమెకు సరదా కాదు.. కాకపోతే.. అదే ప్రొఫెషన్. పెళ్లి చేసుకోవడం ప్రొఫెషన్ ఏంటి అంటారా.. ప్రొఫెషన్ పెళ్లి చేసుకోవడం కాదు.. అబ్బాయిలను మోసం చేయడం. ఇంతకీ ఈ మాయ కిలాడీ మన తెలుగమ్మాయే. కానీ మోసాలు చేసింది మాత్రం ఉత్తరాది కుర్రాళ్లను. అబ్బాయిలకు ముందు వల వేస్తుంది. ఆ తర్వాత పెళ్లి వరకూ తీసుకొస్తుంది.. పెళ్లి చేసుకున్న తర్వాత నగలతో పారిపోతుంది. ఇదీ ఈ అమ్మడి స్కెచ్. ఇlady-cheat;anjali;maya;police;marriage;girl18 మందితో పెళ్లి .. మన తెలుగు అమ్మాయే..ఎందుకో తెలుసా !18 మందితో పెళ్లి .. మన తెలుగు అమ్మాయే..ఎందుకో తెలుసా !lady-cheat;anjali;maya;police;marriage;girlSun, 21 Mar 2021 09:03:00 GMTఅమ్మాయి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది. అందరినీ ఒక్కసారే కాదు లెండి. ఒకరి తర్వాత ఒకరిని.. ఎందుకంటారా.. అదేమీ ఆమెకు సరదా కాదు.. కాకపోతే.. అదే ప్రొఫెషన్. పెళ్లి చేసుకోవడం ప్రొఫెషన్ ఏంటి అంటారా.. ప్రొఫెషన్ పెళ్లి చేసుకోవడం కాదు.. అబ్బాయిలను మోసం చేయడం. ఇంతకీ ఈ మాయ కిలాడీ మన తెలుగమ్మాయే. కానీ మోసాలు చేసింది మాత్రం ఉత్తరాది కుర్రాళ్లను.


అబ్బాయిలకు ముందు వల వేస్తుంది. ఆ తర్వాత పెళ్లి వరకూ తీసుకొస్తుంది.. పెళ్లి చేసుకున్న తర్వాత నగలతో పారిపోతుంది. ఇదీ ఈ అమ్మడి స్కెచ్. ఇందుకు పెద్దగా సమయం కూడా తీసుకోదు. ఏదైనా ఫటాఫట్. మరి ఈ తతంగం అంతా ఒక్కతే ఎలా చేస్తుందని ఆలోచిస్తున్నారా.. అవును..మీరు ఊహించినట్టే ఈ మోసాల్లో ఆమెకు సహకరించేవారూ ఉన్నారు. మొత్తం ఆరుగురి గ్యాంగ్ ఉంది. పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నగలు, నగదుతో ఉడాయించే ఈ అమ్మాయి పేరు అంజలి. భాగ్‌వతి పేరుతో మోసాలు చేస్తుంది.


లేటెస్టుగా  రాజస్థాన్‌లోని జునాగఢ్‌ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత 3 లక్షలకుపైగా విలువ చేసే నగలతో పరారైంది. ఆ కుర్రాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కాస్తా గట్టిగా ప్రయత్నిస్తే ఈ అమ్మాయిగారి బాగోతాలన్నీ వెలుగు చూశాయి. దీంతో అంజలితో పాటు ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. మొత్తం కూపీ లాగితే అమ్మడు అసలు విషయమంతా చెప్పుకొచ్చింది.

ఇప్పటి వరకూ 18 మంది యువకులను ఈ అంజలి మాయ చేసిందట. ఈమె స్వస్థలం తెలుగు రాష్ట్రాలే కావచ్చని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అంజలితో పాటు ఆమెకు సహకరించిన మరో ఐదుగురినీ జునాగఢ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ పెళ్లి గ్యాంగ్ గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మోసాలు చేసిందట.




స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండి అదే దారిలో..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>