PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsb69af959-1614-423b-9e0c-c9d5ea24c40b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsb69af959-1614-423b-9e0c-c9d5ea24c40b-415x250-IndiaHerald.jpg తెలంగాణలో జనసేన ఒంటరి పోరాటానికి సిద్దమౌతుందా అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు కొనసాగించిన జనసేన ఎట్టకేలకు పొత్తు నుండి బయటకు వచ్చేందుకు సిద్దమయింది. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడంలేదని, గౌరవం లేని చోట ఉండబోమని జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తేల్చి చెప్పారు. అయితే మొదటి నుండి కూడా భారత జనతా పార్టీ , జనసేనతో పొత్తును నామమాత్రంగానే చూస్తుందని అనువల్లే పలు నిర్ణయాలను జనసేన తో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని కొందరు రాజకీయ విశ్లgenaral news;pawan;view;pawan kalyan;rachana;tiru;bharatiya janata party;warangal;telangana;janasena;tirupati;husband;letter;janasena party;partyజనసేన తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్దమౌతుందా..??జనసేన తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్దమౌతుందా..??genaral news;pawan;view;pawan kalyan;rachana;tiru;bharatiya janata party;warangal;telangana;janasena;tirupati;husband;letter;janasena party;partySun, 21 Mar 2021 20:00:00 GMT  తెలంగాణలో జనసేన ఒంటరి పోరాటానికి సిద్దమౌతుందా అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు కొనసాగించిన జనసేన ఎట్టకేలకు పొత్తు నుండి బయటకు వచ్చేందుకు సిద్దమయ్యింది. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడంలేదని, గౌరవం లేని చోట ఉండబోమని జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తేల్చి చెప్పారు. అయితే మొదటి నుండి కూడా భారత జనతా పార్టీ , జనసేనతో పొత్తును నామమాత్రంగానే చూస్తుందని అందువల్లే పలు నిర్ణయాలను జనసేన తో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉనఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరు ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది..

 అలాగే తెలంగాణలో గత ఏడాది జరిగిన జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో కూడా జనసేనకు బీజేపీ పార్టీ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని ఇన్ సైడ్ టాక్. దీంతో జనసేన స్వతంత్రంగానే బరిలో దిగి పోరాటం చేయాలని వ్యహాలు రచిస్తుంది. తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో స్వతంత్రంగానే జనసేన బరిలో దిగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న అభిమానులను క్యాడర్ లోకి ఆహ్వానించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం.

వెనుకబడిన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను పవన్ సిద్దం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే జనసేన పోరాటం అనే నినాదంతో పవన్ తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు పూర్తి స్థాయిలో సిద్దమయ్యారని జనసైనికులు చెబుతున్నా మాట.; ఇక ఎటువంటి పొత్తు లేకుండా తాము చేయబోయే ఒంటరి పోరుకు తెలంగాణ నుండే మొదలు పెట్టేందుకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జనసేన వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ ఒంటరి పోరు చేస్తాడా లేక గతంలో మాదిరి ఎన్నికల సమయంలో పొత్తుకు సై అంటారా..అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.    .   .. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>