ViralGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/latest-news-sperm-counts19c03592-8597-4c2e-b254-bbb22d35a6c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/latest-news-sperm-counts19c03592-8597-4c2e-b254-bbb22d35a6c9-415x250-IndiaHerald.jpg ప్రపంచంలోని మ‌గ‌మ‌హారాజులంద‌రికీ హెచ్చ‌రిక‌. మగాళ్ల ఆయువుప‌ట్టుమీద దెబ్బ ప‌డే వైనాన్ని ఒక నివేదిక వెల్లడించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ ఊరు, ఈ ఊరు, ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా ప్ర‌పంచంలోని మ‌గాళ్లంద‌రికీ వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని గుర్తించారు. రసాయనాల కారణంగా క్రమంగా మగాళ్లలోని వీర్యకణాల సంఖ్య త‌గ్గ‌డంతోపాటు అంగ పరిమాణం కూడా కుంచించుకుపోయేందుకు కారణమవుతోందని హెచ్చరించారు.latest news, sperm countsవీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గుతోంది: మ‌గాళ్లంద‌రికీ హెచ్చ‌రిక‌‌వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గుతోంది: మ‌గాళ్లంద‌రికీ హెచ్చ‌రిక‌‌latest news, sperm countsSun, 21 Mar 2021 12:23:00 GMTప్రపంచంలోని మ‌గ‌మ‌హారాజులంద‌రికీ హెచ్చ‌రిక‌. మగాళ్ల ఆయువుప‌ట్టుమీద దెబ్బ ప‌డే వైనాన్ని ఒక నివేదిక వెల్లడించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ ఊరు, ఈ ఊరు, ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా ప్ర‌పంచంలోని మ‌గాళ్లంద‌రికీ వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని గుర్తించారు. రసాయనాల కారణంగా క్రమంగా మగాళ్లలోని వీర్యకణాల సంఖ్య త‌గ్గ‌డంతోపాటు అంగ పరిమాణం కూడా కుంచించుకుపోయేందుకు కారణమవుతోందని హెచ్చరించారు. కౌంట్‌డౌన్ పేరుతో తాజాగా విడుదల చేసిన పుస్తకంలోని విష‌యాల‌ను  షన్నాస్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు వెల్ల‌డించారు. ఈ పుస్తకం చెప్పిన దాని ప్రకారం 1973తో పోలిస్తే 2021కి.. అంటే 48 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో  మగాళ్లలో వీర్య కణాల సంఖ్య 60 శాతం తగ్గిందని.. ఇదే ఒర‌వ‌డి కొన‌సాగితే 2045 నాటికి వీర్య‌క‌ణాల సంఖ్య సున్నాకు చేర‌తాయ‌ని హెచ్చ‌రించారు.

మాన‌వ ఉత్ప‌త్తే ఉండ‌దు
ష‌న్నాస్వాన్ చెప్పిన‌ట్లు అదేక‌నుక వాస్తవరూపం దాలిస్తే భ‌విష్య‌త్తులో మాన‌వ‌జాతి మ‌నుగ‌డ‌కే ముప్పు వాటిల్ల‌నుంద‌న్న విష‌యం వెల్ల‌డైన‌ట్లే. దీనికి కార‌ణం మ‌నం రోజువారీ ఉప‌యోగించే వ‌స్తువ‌ల్లోని ర‌సాయనాలేన‌ని చెబుతున్నారు. స‌బ్బులు, షాంపూలు, క్యారీబ్యాగులు, డియోడ్రెంట్లు... ఇలా అన్నీ క‌లిసి మ‌గ‌జాతి కొంప ముంచుతున్నాయి. చాలా వస్తువుల్లో వాడే పీఎఫ్ఏఎస్ గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ప్రకృతిలో బ్రేక్‌డౌన్‌ కావని.. ఇవి శరీరంలోనే ఉండిపోతాయ‌ని చెబుతున్నారు.
వీటి సంఖ్య రోజురోజుకూ పెరిగి శ‌రీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంద‌ని చెప్పారు.

కొన్ని దేశాల్లో నిషేధం
అయితే.. ఈ రసాయనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా లేదు. కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధించ‌గా, మరికొన్ని దేశాల్లో పాక్షిక నిషేధం విధించారు. ఈ రసాయనాల కారణంగా మగవారి అంగ పరిణామం.. వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకో పాతిక సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. ఇప్పుడున్న స్పీడుయుగంలో మ‌నంత‌ట‌మ‌నం మార‌డానికి కూడా అవ‌కాశం లేద‌ని, ర‌సాయనాల‌ను నిరోధించే ఉత్ప‌త్తుల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించే ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌భుత్వాలే ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంద‌ని, అలా అయితేనే పురుషుల‌కు ఈ ముప్పు త‌ప్పుతుంద‌ని ష‌న్నా స్వాన్ చెప్పారు. మరి.. ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాయో? లేదో?


కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>