PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccination-at-your-door-step46671f80-6cc6-4410-97dd-fa9994bfdd73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccination-at-your-door-step46671f80-6cc6-4410-97dd-fa9994bfdd73-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై రెండు నెలలు పూర్తయినా.. అనుకున్నంత వేగంగా ఆ ప్రక్రియ కొనసాగడంలేదనే ఆరోపణలున్నాయి. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అయితే వారిలో చాలామంది వెనకగుడు వేయడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో ఏపీ సర్కారు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతంరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయcovid vaccine, sachivalayam,;amala akkineni;krishna river;andhra pradesh;central government;aadharకరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ సంచలన నిర్ణయం..కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ సంచలన నిర్ణయం..covid vaccine, sachivalayam,;amala akkineni;krishna river;andhra pradesh;central government;aadharSun, 21 Mar 2021 08:00:00 GMTఏపీ సర్కారు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతంరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టబోతోంది.

ఇప్పటి వరకూ, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇకపై వ్యాక్సిన్లను ప్రజల దగ్గరకే చేరవేయబోతోంది ఏపీ సర్కారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం పైలెట్‌ ప్రాజెక్ట్ కింద గుంటూరు, కృష్ణా జిల్లాల కింద ఎంపిక చేసిన సచివాలయాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. శనివారం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇతర సచివాలయాలకు కూడా దీన్ని విస్తరించాలని చూస్తోంది ప్రభుత్వం.

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు దాటిన వారి వివరాలుంటాయి. వ్యాక్సినేషన్ ‌కు ముందు రోజే వారి ఆధార్‌ కార్డులను ఏఎన్‌ఎంలు, వాలంటీర్ల ద్వారా సేకరించి పేర్లు నమోదు చేసుకుంటారు. తర్వాతి రోజు వారిని సచివాలయాలకు పిలిపించి, ఒకవేళ వారు రాలేని పక్షంలో ఆరోగ్య కార్యకర్తలే వారి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తారు.

ఇంటికి దగ్గర్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ ఇప్పటి వరకూ ఏ దేశంలోనూ అమలులోకి రాలేదు. ఆస్పత్రుల్లోనే ఆ ప్రక్రియ చేపట్టేవారు. సచివాలయాల్లో టీకా పంపిణీ మొదలయితే, ఇలాంటి వినూత్న విధానాన్ని అమలులోకి తెచ్చిన రాష్ట్రంగా ఏపి రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టేందుకు కూడా ఏపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వ్యాక్సిన్ వృథా కాకుండా.. దాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు చేరవేయబోతోంది. అందులో భాగంగానే సచివాలయాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెడుతోంది. 


రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైకే... కానీ అదికాదు‌

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>