PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-vs-governor-officeab787508-5394-400c-bf27-1e3df9ca7e00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-vs-governor-officeab787508-5394-400c-bf27-1e3df9ca7e00-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నెలకొన్న ప్రచ్చన్న యుద్ధం సమసిపోతుంది అని అందరూ భావించారు. కానీ అది ఎడతెగని యుద్ధం అనే విషయం ఇప్పుడు నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం ఎలా అయినా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సైతం ముగించాలని చూస్తుంది. కానీ నిమ్మగడ్డ మాత్రం ఏమైందో ఏమో అర్ధాంతరంగా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను బయటకు రప్పించాలని అనుకుందో ఏమో తెలియదు గానీ ఎప్పటిదో ప్రివిలేజ్ కమిటీ అంశాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చింది ప్రభుత్వంnimmagadda;kumaar;andhra pradesh;high court;media;governorప్రివిలేజ్ కమిటీ నోటీసులకు కౌంటర్ గానే నిమ్మగడ్డ లీకేజీ కేసు ?ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు కౌంటర్ గానే నిమ్మగడ్డ లీకేజీ కేసు ?nimmagadda;kumaar;andhra pradesh;high court;media;governorSun, 21 Mar 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నెలకొన్న ప్రచ్చన్న యుద్ధం సమసిపోతుంది అని అందరూ భావించారు. కానీ అది ఎడతెగని యుద్ధం అనే విషయం ఇప్పుడు నెమ్మదిగా అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం ఎలా అయినా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సైతం ముగించాలని చూస్తుంది. కానీ నిమ్మగడ్డ మాత్రం ఏమైందో ఏమో అర్ధాంతరంగా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను బయటకు రప్పించాలని అనుకుందో ఏమో తెలియదు గానీ ఎప్పటిదో ప్రివిలేజ్ కమిటీ అంశాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చింది ప్రభుత్వం. తమ ముందు విచారణకు హాజరవ్వాలని మొన్న సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది.

 అయితే తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కారణంగా ఇప్పుడు బయటకు రాలేను అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా తెల్లారేసరికి మరో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను గవర్నర్ తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు అన్ని సోషల్ మీడియా లో ప్రత్యక్షం అవుతున్నాయి అని దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అవసరమైతే సి బి ఐ ఎంక్వయిరీ కూడా చేయించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఏమనుకున్నారో ఏమో కానీ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ ఉపయోగించారు. అయితే ఇప్పటి వరకు లేదు కానీ ఈ అంశాన్ని ఇప్పుడు సడన్గా తెర మీదకు తీసుకు రావడానికి కారణం ప్రివిలేజ్ కమిటీ నోటీసులేనని అంటున్నారు. అంటే ప్రివిలేజ్ కాబట్టి నోటీసులు ఇచ్చారు కాబట్టి దానికి కౌంటర్ గా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అంటున్నారు. అయితే మరి ఈ అంశం ఎంత దూరం వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది. సమసిపోయింది అనుకున్న వివాదం మళ్లీ మొదలవటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైకే... కానీ అదికాదు‌

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>