PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ambani-case14312241-320e-4b6b-ae70-bcdc5b440236-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ambani-case14312241-320e-4b6b-ae70-bcdc5b440236-415x250-IndiaHerald.jpgముకేశ్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనాల కేసు సస్పెన్స్ సినిమా థ్రిల్లర్‌ను మరిపిస్సోంది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట్లో ఏదో ఉగ్రవాదుల పనిలే అనుకున్నారు.. ఆ తర్వాత ఏకంగా పోలీసుల పాత్ర ఉందని తేలడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ కేసులో ఏకంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకూ సంబంధం ఉందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఆయన ప్లేసులో కొత్త అధికారి ambani-case;mumbai;maharashtra - mumbai;uddhav thackeray;veer singhh;cinema;police;chief minister;minister;maharashtra;congress-ncp;letter;traffic police;mahaషాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?ambani-case;mumbai;maharashtra - mumbai;uddhav thackeray;veer singhh;cinema;police;chief minister;minister;maharashtra;congress-ncp;letter;traffic police;mahaSun, 21 Mar 2021 10:00:00 GMTసినిమా థ్రిల్లర్‌ను మరిపిస్సోంది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట్లో ఏదో ఉగ్రవాదుల పనిలే అనుకున్నారు.. ఆ తర్వాత ఏకంగా పోలీసుల పాత్ర ఉందని తేలడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ కేసులో ఏకంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకూ సంబంధం ఉందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.


ఇప్పటికే ఈ కేసులో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఆయన ప్లేసులో కొత్త అధికారి వచ్చారు. ఈ నేపథ్యంలో సదరు పాత అధికారి ఏకంగా ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. తనను ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పదవి నుంచి ఎందుకు బదిలీ చేశారో వివరిస్తూ ఆయన లేఖ రాశారు. అసలు ఈ కేసులో కీలక పాత్ర హోంమంత్రిదే అంటున్నారాయన. ముంబయి క్రైం బ్రాంచ్‌కు చెందిన నిఘావిభాగం అధిపతి సునీల్‌ వాజేను గత కొన్ని నెలల్లో చాలాసార్లు తన అధికారిక నివాసానికి హోం మంత్రి పిలిపించుకున్నారని తెలిపారు.


ముంబయిలో భారీగా నిధుల వసూలు చేయాలని హోంమంత్రి పోలీసులకు టార్గెట్‌లు విధించే వారట. నెలకు కనీసం రూ.100 కోట్లు వసూలయ్యేలా చూడాలని హోంమంత్రి  వాజేకు చెప్పినట్లు లేఖలో రాశారు. ముంబయిలో 1750 బార్లు ఉన్నాయని, వాటి నుంచి 2, 3 లక్షలు వసూలు చేసినా.. నెలకు 40 నుంచి 50 కోట్ల లక్ష్యం సాధించవచ్చని హోంమంత్రి చెప్పేవారట. ఆ తర్వాత  ఏసీపీ సంజయ్‌ పాటిల్‌ను కూడా మంత్రి తన నివాసానికి పిలిపించుకొని అదే విషయాన్ని చెప్పారట. ఇప్పుడు ఈ పరమ్ వీర్ సింగ్ లేఖ మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


అసలే ఎన్సీపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. అయితే ఈ ఆరోపణలను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండిస్తున్నారు. ముకేశ్‌ అంబానీ కేసులో, మన్‌సుక్‌ హిరేన్‌ హత్యలో సచిన్‌ వాజే పాత్ర స్పష్టమైందని.. తదుపరి విచారణలో తన పేరు కూడా బయటికి వస్తుందని పరమ్‌వీర్‌ సింగ్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.




కేరళలో ఎన్డీఏ కు భారీ షాక్.. ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ..

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

జగన్ తోనే జగన్ కి పోటీయా.. ఎక్కడ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>