Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/netizens-angry-on-bumrah-for-using-fire-crackers-in-wedding-ceremonyf9027238-f891-43eb-8630-dbcf35fd1612-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/netizens-angry-on-bumrah-for-using-fire-crackers-in-wedding-ceremonyf9027238-f891-43eb-8630-dbcf35fd1612-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల ప్రతి కదలికనూ అభిమానులు, విమర్శకులు గమనిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారు చేసే చిన్న చిన్న తప్పులే కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. పెళ్లి ఫోటోలను షేర్ చేస్తే ఆగ్రహం ..bumrah;sports;jeevitha rajaseskhar;mithra;sanjjanaa galrani;diwali;media;marriage;twitter‘మాకు చెప్పి నువ్వు చేస్తోందేమిటి..?’ బుమ్రా పెళ్లి ఫోటోపై నెటిజన్ల ఆగ్రహం‘మాకు చెప్పి నువ్వు చేస్తోందేమిటి..?’ బుమ్రా పెళ్లి ఫోటోపై నెటిజన్ల ఆగ్రహంbumrah;sports;jeevitha rajaseskhar;mithra;sanjjanaa galrani;diwali;media;marriage;twitterSat, 20 Mar 2021 17:57:50 GMTఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీల ప్రతి కదలికనూ అభిమానులు, విమర్శకులు గమనిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారు చేసే చిన్న చిన్న తప్పులే కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. పెళ్లి ఫోటోలను షేర్ చేస్తే ఆగ్రహం ఎందుకబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..? ఎందుకంటే ఆ ఫోటోల్లో కొత్త దంపతులైన బుమ్రా, సంజన నడుచుకుంటూ వస్తుంటే పక్కన బంధువులు బాణసంచా కాలుస్తున్నారు. ఈ ఫోటోపైనే నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మాకు నీతులు చెప్పి నువ్వు చేస్తోందేంటి..?’ అంటూ మండిపడుతున్నారు.

2017లో బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో దీపావళి రోజున టపాసులు కాల్చొద్దంటూ అభిమానులను కోరాడు. బాణసంచా వల్ల పర్యావరణం కలుషితమవుతుందని, అది ప్రకృతిని, భూమిని దెబ్బతీస్తుందని చెప్పాడు. అయితే ఇప్పుడు పెళ్లి వేడుకల్లో బుమ్రా బాణసంచా వినియోగించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో బుమ్రా చేసిన పోస్ట్‌ను ఇప్పుడు తిరిగి పోస్ట్ చేస్తూ అతడి మండిపడుతున్నారు. ‘మొదట నీవు పాటించు. ఆ తర్వాత మాకు చెప్పు’, ‘భాయ్‌.. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’ ‘నీవు కాలిస్తే కాలుష్యం కాదు. మేం కాలిస్తే మాత్రం కాలుష్యం.. ఇదెక్కడి న్యాయం..?’ అంటూ కౌంటర్లిస్తున్నారు. మరి దీనికి బుమ్రా ఎలా సమాధానం చెబుతాడో చూడాలి.

కాగా బుమ్రా ఈ నెల 15న స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఈ వేడుక జరిగింది. ఏడడుగులు వేసే వరకూ ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన బుమ్రా పెళ్లి అనంతరం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన పెళ్లి గురించి వెల్లడించాడు. ఈ క్రమంలోనే వివాహ వేడుకలో భాగంగా సంజనతో కలిసి తీసుకున్న మరో రెండు ఫొటోలను శుక్రవారం ఆన్‌‌లైన్‌లో షేర్ చేశాడు. గతకొన్ని రోజులుగా తన జీవితం అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే తమ దంపతులను దీవించిన, శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు.

" style="height: 369px;">

" style="height: 1127px;">

">






శశి సినిమా మొదటి రోజు ఎంత రాబట్టిందంటే....?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>