CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/goal-mall-of-loans-in-a-rural-bank-he-is-the-one-who-ran-the-whole-storyc3dccf70-3a55-46b6-aff2-32a7f333d0b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/goal-mall-of-loans-in-a-rural-bank-he-is-the-one-who-ran-the-whole-storyc3dccf70-3a55-46b6-aff2-32a7f333d0b7-415x250-IndiaHerald.jpgఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాల విషయంలో గోల్ మాల్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారి కాగా, డబ్బుకు ఆశపడి బ్యాంక్ మేనేజర్లు అతను చెప్పినట్టు చేశారు. అయితే ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్.. కొన్ని రుణాలు చెల్లింపులపై అనుమానంతో రికార్డులను పరిశీలించగా అవి నకిలీ పాస్‌పుస్తకాలు అని తేలింది.rural bank;koti;amala akkineni;prabhakar;telangana;rbi;2019;police;chintamaneni prabhakar;bank;driver;arrest;parakala prabhakarగ్రామీణ బ్యాంకులో రుణాల గోల్‌ మాల్.. మొత్తం కథ నడిపింది అతడే..!?గ్రామీణ బ్యాంకులో రుణాల గోల్‌ మాల్.. మొత్తం కథ నడిపింది అతడే..!?rural bank;koti;amala akkineni;prabhakar;telangana;rbi;2019;police;chintamaneni prabhakar;bank;driver;arrest;parakala prabhakarSat, 20 Mar 2021 10:00:00 GMTతెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాల విషయంలో గోల్ మాల్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారి కాగా, డబ్బుకు ఆశపడి బ్యాంక్ మేనేజర్లు అతను చెప్పినట్టు చేశారు. అయితే ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్.. కొన్ని రుణాలు చెల్లింపులపై అనుమానంతో రికార్డులను పరిశీలించగా అవి నకిలీ పాస్‌పుస్తకాలు అని తేలింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముత్తారం మండలం మైదంబడ్డ గ్రామానికి చెందిన ప్రభాకర్.. 2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్‌ కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన పత్రాలు, ప్రక్రియపై అవగాహన పెంచుకున్నాడు. పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించాడు.అలాగే పెద్దపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర రబ్బర్‌ స్టాంప్స్‌ దుకాణంలో ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, వీఆర్వో స్టాంపులు చేయించాడు.

అయితే పట్టా పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం మంథని కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సదానందం సాయం తీసుకున్నాడు. అనంతరం తన ప్లాన్‌ను అమలు చేశాడు. రుణాలు మాఫీ జరుగుతందని ప్రచారం చేశాడు. ఒక్కో రుణానికి రూ.5,000 కమీషన్‌ ఇస్తానని చెప్పి ఆ సమయంలో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా 153 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో నిందితులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో కోటి 99లక్షల 89 వేల రూపాయల రుణం తీసుకున్నారు.

అంతేకాదు.. నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంక్ రుణాలు పొందినట్టు ఫిర్యాదు అందడంతో.. అసలు సూత్రధారి ప్రభాకర్‌తో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ. 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులు, పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్నవారిలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఒక వీఆర్వో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు.


కాపు వేద‌న‌: కాపుల ఓట్ల‌ను వ‌దిలేసుకుంటున్నారా ?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>