PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-party-info7fe6997b-854d-456e-b2bb-3a32da54ee2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-party-info7fe6997b-854d-456e-b2bb-3a32da54ee2f-415x250-IndiaHerald.jpgఇక స‌త్తుప‌ల్లి, మ‌ధిర సీట్లు కూడా నాడు వైసీపీ తృటిలో కోల్పోయింది. ఆ త‌ర్వాత ఈ ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా గులాబీ గూటికి చేరిపోయారు. ఏదేమైనా తెలంగాణ‌లో జ‌రిగిన ఉద్య‌మం ఖ‌మ్మంలో ఆ స్థాయిలో జ‌ర‌గ‌లేదు. అందుకే 2014లో ఇక్క‌డ వైసీపీ, టీడీపీలు గెలిచాయి. ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఖ‌మ్మం సీటును మాత్ర‌మే గెలిస్తే... టీడీపీ స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట సీట్లు గెలిచింది. ఈ జిల్లాలో వైఎస్ అంటే ఎంతో అభిమానించే నాయ‌కులు ఉన్నారు. అందుకే ఇప్పుడు ష‌ర్మిల ఇక్క‌డ నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం y s sharmila;puri jagannadh;seema;srinivas;telangana rashtra samithi trs;telangana;mp;district;scheduled tribes;police;rayalaseema;mla;minister;letter;tdp;ycp;pinapaka;reddy;petta;partyష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?y s sharmila;puri jagannadh;seema;srinivas;telangana rashtra samithi trs;telangana;mp;district;scheduled tribes;police;rayalaseema;mla;minister;letter;tdp;ycp;pinapaka;reddy;petta;partySat, 20 Mar 2021 09:25:00 GMTపార్టీ ప్ర‌క‌ట‌న తేదీ కూడా వ‌చ్చేసింది. ఆమె ఏప్రిల్ 9న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా సాక్షిగా రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న శంఖారావాన్ని పూరించ‌నున్నారు. ల‌క్ష మంది స‌మ‌క్షంలో ఆమె కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుందని ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు.. ఇందుకు తెలంగాణ పోలీసులు అనుమ‌తులు కూడా వ‌చ్చేశాయి. ష‌ర్మిల కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోనే ఎక్కువుగా అల‌జ‌డి మొద‌లు అయ్యింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌తో పాటు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల‌కు చెందిన నేత‌లే ఎక్కువుగా స్పందిస్తున్నారు. ఖ‌చ్చితంగా ఆమె పార్టీ ప్ర‌భావం పై మూడు ప్రాంతాల్లో ఉంటుంద‌న్న‌ది నిజం. అయితే అది ఏ మేర‌కు ఉంటుంద‌న్న‌ది ఆమె పొలిటిక‌ల్ స్టామినాను బట్టి ఉంటుంది.. అది అప్పుడే అంచ‌నాకు రాలేం.

వాస్త‌వానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే వైఎస్ ఫ్యామిలీ అభిమానుల‌తో పాటు సీమాంధ్ర జ‌నాలు ఎక్కువ‌. అక్క‌డ కొత్త పార్టీ స‌భ పెట్ట‌వ‌చ్చు. అయితే ఆమె దృష్టంతా ఉమ్మ‌డి ఖ‌మ్మం మీదే ఉంది. ఇందుకు చాలానే కార‌ణాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో నాటి వైఎస్ నుంచి నేడు జ‌గ‌న్ వ‌ర‌కు ఎంతో ప్ర‌భావం చూపారు. 2004, 2009 ఎన్నిక‌ల్లోనే కాకుండా 1999లో వైఎస్ ఓడిపోయిన‌ప్పుడు కూడా ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు చెప్పుకోద‌గ్గ సీట్లు వ‌చ్చాయి. నాడు ఖ‌మ్మం ఎంపీ సీటు సైతం కాంగ్రెస్సే గెలిచింది. ఆ త‌ర్వాత 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కూడా తెలంగాణ‌లో వైసీపీ ప్ర‌భావం లేక‌పోయినా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యే, ఖ‌మ్మం ఎంపీ సీటు వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి.

ఎస్టీ నియోజకవర్గాలైన పినపాక, వైరా, అశ్వారావు పేట సీట్ల‌తో పాటు ఖ‌మ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఇక స‌త్తుప‌ల్లి, మ‌ధిర సీట్లు కూడా నాడు వైసీపీ తృటిలో కోల్పోయింది. ఆ త‌ర్వాత ఈ ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా గులాబీ గూటికి చేరిపోయారు. ఏదేమైనా తెలంగాణ‌లో జ‌రిగిన ఉద్య‌మం ఖ‌మ్మంలో ఆ స్థాయిలో జ‌ర‌గ‌లేదు. అందుకే 2014లో ఇక్క‌డ వైసీపీ, టీడీపీలు గెలిచాయి. ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఖ‌మ్మం సీటును మాత్ర‌మే గెలిస్తే... టీడీపీ స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేట సీట్లు గెలిచింది. ఈ జిల్లాలో వైఎస్ అంటే ఎంతో అభిమానించే నాయ‌కులు ఉన్నారు. అందుకే ఇప్పుడు ష‌ర్మిల ఇక్క‌డ నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ఎంచుకుంటే అటు ఖ‌మ్మం కోడ‌లిని అన్న సెంటిమెంట్‌తో పాటు సీమాంధ్ర ప్ర‌భావం ఎక్కువుగా ఉండ‌డంతో ఇక్క‌డ బ‌ల‌మైన ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌న్న ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఆమె పాలేరు నుంచి పోటీ చేసే యోచ‌న‌లో ఉండ‌డానికి ఇక్క‌డ రెడ్డి వ‌ర్గం బ‌లంగా ఉండ‌డమే కార‌ణం. మాజీ మంత్రి సంబాని చంద్ర‌శేఖ‌ర్‌, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్‌, పాయం వెంక‌టేశ్వ‌ర్లు లాంటి వారంతా ఇప్పుడు ష‌ర్మిల పార్టీ వైపు చూస్తున్న‌ట్టు భోగ‌ట్టా ?  ఏదేమైనా ష‌ర్మిల మిగిలిన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉన్నా ఉమ్మ‌డి ఖ‌మ్మంలో మాత్రం పార్టీ ప్ర‌క‌ట‌న‌కు ముందే ప్ర‌కంప‌న‌లు రేపుతున్నారు.




వైశ్య వేద‌న‌: పొలిటిక‌ల్ ఫైట్‌లో... నాటి గుర్తింపు నేడేదీ ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : విచిత్రపరిస్దితుల్లో ఇరుక్కున్న నిమ్మగడ్డ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>