PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tirupati-bypoll-cm-jagan-ys-jagan-8d16e565-e5eb-444e-93c8-49ed7f39042c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tirupati-bypoll-cm-jagan-ys-jagan-8d16e565-e5eb-444e-93c8-49ed7f39042c-415x250-IndiaHerald.jpgసార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభకు వైసీపీకి వచ్చిన ఓట్లు 7,22,877. ఇవి కేవలం సీఎం జగన్ పాలనపై ఆశతో ప్రజలు వేసిన ఓట్లు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతికి ఉప ఎన్నిక జరుగుతోంది. అంటే ఇప్పుడు వైసీపీకి వచ్చే ఓట్లు.. ఈ రెండేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి. 7 లక్షలకు ఎన్ని ఎక్కువ వస్తే, ప్రజలు అంత ఎక్కువగా జగన్ ని విశ్వసించినట్టు లెక్క. అప్పటి ఓట్లు జగన్ పై ఆశ అయితే, ఇప్పటి ఓట్లు జగన్ పై నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఏమాత్రం ఓట్లు తగ్గినా, మెజార్టీ తగ్గినా, ప్రతిపక్షాల హడాtirupati bypoll, cm jagan, ys jagan,;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;peddireddy ramachandra reddy;yv subbareddy;tirupati;assembly;mla;minister;husband;letter;tdp;local language;central government;y v subbareddy;party;tirumala tirupathi devasthanam;sajjala ramakrishna reddy;nandyalaతిరుపతిపై అంత జాగ్రత్త ఎందుకంటే..?తిరుపతిపై అంత జాగ్రత్త ఎందుకంటే..?tirupati bypoll, cm jagan, ys jagan,;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;peddireddy ramachandra reddy;yv subbareddy;tirupati;assembly;mla;minister;husband;letter;tdp;local language;central government;y v subbareddy;party;tirumala tirupathi devasthanam;sajjala ramakrishna reddy;nandyalaSat, 20 Mar 2021 10:00:00 GMTసార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభకు వైసీపీకి వచ్చిన ఓట్లు 7,22,877. ఇవి కేవలం సీఎం జగన్ పాలనపై ఆశతో ప్రజలు వేసిన ఓట్లు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతికి ఉప ఎన్నిక జరుగుతోంది. అంటే ఇప్పుడు వైసీపీకి వచ్చే ఓట్లు.. ఈ రెండేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి. 7 లక్షలకు ఎన్ని ఎక్కువ వస్తే, ప్రజలు అంత ఎక్కువగా జగన్ ని విశ్వసించినట్టు లెక్క. అప్పటి ఓట్లు జగన్ పై ఆశ అయితే, ఇప్పటి ఓట్లు జగన్ పై నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఏమాత్రం ఓట్లు తగ్గినా, మెజార్టీ తగ్గినా, ప్రతిపక్షాల హడావిడి తట్టుకోలేరు. అందుకే జగన్ అంత పగడ్బందీగా తిరుపతి కోసం స్కెచ్ వేశారు.

వ్యూహ రచనలో బాబు సరిపోరు..
నంద్యాల ఉప ఎన్నికలకోసం అప్పట్లో చంద్రబాబు గీసిన స్కెచ్ కంటే అదిరిపోయే ప్రణాళికను తిరుపతి బై పోల్ కోసం సిద్ధం చేశారు జగన్. బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబానికి తిరుపతి ఉప ఎన్నికలకు ముందే న్యాయం చేసి, ఆయా వర్గాల్లో మరింత భరోసా నింపారు జగన్. మాటమీద నిలబడతారని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఉప ఎన్నిక కోసం తిరుపతి పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలతోపాటు, ఒక నాన్ లోకల్ ఎమ్మెల్యే, మరో మంత్రిని అదనంగా కేటాయించారు. మొత్తం ముగ్గురు నాయకులు, ఏడు నియోజకవర్గాలకు కలిపి 21మంది నాయకులు ఎన్నికల పర్వాన్ని పర్యవేక్షిస్తారు. ఎన్నికలయ్యే వరకు వీరందరి మకాం అక్కడే. వీరిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూపర్ విజన్ ఉంటుంది. కేంద్ర కార్యాలయం నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంప్రదింపులు అదనం. ఇలా.. పక్కాగా ఎన్నికల ప్రణాళిక రచించారు సీఎం జగన్.

దుబ్బాకలాంటి విపరీతం జరగకూడదు..
దుబ్బాకలో సునాయాస విజయం సాధించాల్సిన టీఆర్ఎస్, చివరకు ఓటమిపాలైన విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని సైతం రంగంలోకి దింపింది. తిరుపతి వ్యవహారంలో కూడా బీజేపీ అలాంటి ప్రయోగాలు చేయకమానదు. అంతమాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇటు టీడీపీ కూడా జిమ్మిక్కులు చేయడానికి రెడీగా ఉంది. చివరకు రెండు పార్టీలు ఓట్లు చీలిస్తే.. వైసీపీకి వచ్చే మెజార్టీ తగ్గితే ప్రజల ముందు తలెత్తుకోవడం కష్టం. అందుకే జగన్ తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. ఓట్లు పెరగాలి, మెజార్టీ పెరగాలి, ఇదే ఆయన పార్టీ నేతలకు ఫిక్స్ చేసిన టార్గెట్.  


ముహూర్తం ఫిక్స్ చేసేసిన పవన్ కళ్యాణ్...?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>