PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-ramesh-kumardd9c09c1-ec77-48f7-9464-b54f20041204-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-ramesh-kumardd9c09c1-ec77-48f7-9464-b54f20041204-415x250-IndiaHerald.jpgఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సభా హక్కుల నోటీసుకి స్పందిస్తూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాధానలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను, అందుకే బయటకు రాలేను అని మెన్షన్ చేశారు. దీన్నిప్పుడు వైరి వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. గతంలో తాము వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డంకి అవుతాయి, వాయిదా వేయమంటే రకరకాల కారణాలు చెప్పిన నిమ్మగడ్డ, ఇప్పుడు టీకా వేయించుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. nimmagadda ramesh kumar;kumaar;korcha;botcha satyanarayana;assembly;minister;ycp;reddy;mantraటీకా వేసుకున్నాను.. బయటకు రాలేను..టీకా వేసుకున్నాను.. బయటకు రాలేను..nimmagadda ramesh kumar;kumaar;korcha;botcha satyanarayana;assembly;minister;ycp;reddy;mantraSat, 20 Mar 2021 10:30:00 GMTకుమార్ సభా హక్కుల నోటీసుకి స్పందిస్తూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమాధానలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను, అందుకే బయటకు రాలేను అని మెన్షన్ చేశారు. దీన్నిప్పుడు వైరి వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. గతంలో తాము వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డంకి అవుతాయి, వాయిదా వేయమంటే రకరకాల కారణాలు చెప్పిన నిమ్మగడ్డ, ఇప్పుడు టీకా వేయించుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుల మేరకు, సభా హక్కుల సంఘం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై విచారణకు సిద్ధమైంది. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఆయనకు నోటీసులు పంపించారు. ఆయనపై విచారణ చేపట్టబోతున్నామని, అవసరమైతే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని దానిలో సూచించారు. దీనిపై నిమ్మగడ్డ స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు తనకు వర్తించదని.. తన పరిధిలోకి రాదని అన్నారు. శాసనసభ అంటే తనకు అత్యంత గౌరవం ఉందని.. సభా హక్కులను తాను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్ గా తాను శాసనసభ హక్కులకు భంగం కలిగించానన్న ఆరోపణను నిమ్మగడ్డ ఖండించారు. ఒకవేళ సభాహక్కుల నోటీసుపై ముందుకే వెళ్లాలని.. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కోరుకుంటే.. తగిన సమయం చూసుకుని తాను సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఉన్నానని.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నందువల్ల ప్రయాణాలు చేయొద్దని డాక్టర్లు తనకు సూచించినట్టు సమాధానంగా పంపించిన లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. మరోవైపు ఆయన తన ఎల్టీఏని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలిసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత నిమ్మగడ్డ ఇంటికే పరిమితం అయ్యారు. ఆఫీసు వ్యవహారాలన్నీ ఇంటి వద్దనుంచే పర్యవేక్షిస్తున్నారు.

అయితే మంత్రుల ఫిర్యాదుతో ఆయనపై చర్య తీసుకోడానికి సభా హక్కుల సంఘం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా అసెంబ్లీ కార్యదర్శితో నోటీసు ఇప్పించారు. దీనికి సమాధానం ఇచ్చిన నిమ్మగడ్డ అసలు ఆ నోటీసు తనకు వర్తించదని చెప్పడం కొసమెరుపు.


త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఇదో చిత్రం.. తెలిస్తే... న‌వ్వాపుకోలేరు..!

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>