PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna8c85fab6-eabc-4771-bfc0-05e82fdf74cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna8c85fab6-eabc-4771-bfc0-05e82fdf74cf-415x250-IndiaHerald.jpgరెండో స్థానం కోసం మల్లన్న, కోదండరామ్ మధ్య హోరాహోరీ సాగుతోంది.రెండో స్థానంలో నిలిస్తే... చివరి రౌండ్ లో గెలుపు ఖాయమనే అంచనాలో మల్లన్న, కోదండరామ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు మూడో స్థానానికి ఎవరి పడిపోతారన్నదే.teenmar mallanna;ramu;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;nalgonda;professor;reddy;nayakతీన్మార్ మల్లన్న- కోదండ హోరాహోరీతీన్మార్ మల్లన్న- కోదండ హోరాహోరీteenmar mallanna;ramu;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;nalgonda;professor;reddy;nayakSat, 20 Mar 2021 08:45:41 GMTటీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్ లో ఉన్నా... రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. ఫస్ట్ ప్రియారిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆధిక్యత రాగా.. రెండో ప్రయారిటీలో మాత్రం కోదండరామ్, తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నారు. రెండో ప్రయారిటీలో ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనకబడగా.. కోదండరామ్. మల్లన్నకు పోటాపోటీగా ఓట్లు వస్తున్నాయి.  

నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 66 మందిని ఎలిమినేషన్ చేశారు. వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి తొలగింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి లక్షా 17 వేల 386 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్న  91 వేల  858  ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్   79 వేల 110 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 42 వేల 15 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాములు నాయక్ కు 29 వేల ఓట్లు రావడంతో... ఈ రౌండ్ లో రెండో ఓటు ఎవరికి ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తిగా మారింది

తొలి ప్రాధాన్యత ఓటులో పల్లాకు 27 వేల 550 ఓట్ల ఆధిక్యం రాగా... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మాత్రం పల్లా వెనకబడ్డారు. ఆయన మూడో స్థానానికి పడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న , కోదండరామ్ పుంజుకోవడంతో... పల్లా లీడ్ క్రమంగా తగ్గుతోంది. 66 మంది ఎలిమినేషన్ అయ్యేసరికి పల్లా ఆధిక్యం 25 వేల 5 వందలకు పడిపోయింది. ఇప్పటికే రెండు వేల ఓట్ల లీడ్ తగ్గించారు తీన్మార్ మల్లన్న. రెండో ప్రాధాన్యత ఓట్లలో ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ కొనసాగితే.. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ వరకు వచ్చేసరికి పల్లాపై తీన్మార్ మల్లన్న లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోదండరామ్ కు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ కంటే 12 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే బీజేపీ ఎలిమినేషన్ లో తనకు భారీగా ఓట్లు వస్తాయని కోదండరామ్ ఆశతో ఉన్నారు.

ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. రేసులో ఉండాలంటే.. ముందు మూడో స్థానానికి పడిపోకుండా ఉండాలి. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత... మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి ఎలిమినేషన్ ఉంటుంది. అంటే తీన్మార్ ను కోదండరామ్ క్రాస్ చేయకపోతే.. ఆయన ఎలిమినేట్ అవుతారు. సో.. ఇప్పుడు రెండో స్థానం కోసం మల్లన్న, కోదండరామ్ మధ్య హోరాహోరీ సాగుతోంది.రెండో స్థానంలో నిలిస్తే... చివరి రౌండ్ లో గెలుపు ఖాయమనే అంచనాలో మల్లన్న, కోదండరామ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు మూడో స్థానానికి ఎవరి పడిపోతారన్నదే.


కాపు వేద‌న‌: కాపుల ఓట్ల‌ను వ‌దిలేసుకుంటున్నారా ?

ష‌ర్మిల ఖ‌మ్మం టార్గెట్ వెన‌క ఇంత స్కెచ్ ఉందా ?

విశాఖ‌లో ఏడుగురు టీడీపీ కార్పొరేట‌ర్లు జంప్.. షోకాజ్ నోటీసులు

అపరిచితుడు క్లైమాక్స్ లో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..!?

హెరాల్డ్ సెటైర్ : జేసీల అతితెలివికి కోర్టులో ఎదురుదెబ్బ

సౌత్ లో బాగా విజయవంతమైన టాక్ షో లు ఇవే... హోస్ట్ ఎవరంటే..?

మరోసారి చంద్రబాబు ముందు జగన్ జీరో అయ్యారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>