MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies-resultsade82a38-002f-45e8-b051-616629c5ca19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies-resultsade82a38-002f-45e8-b051-616629c5ca19-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరం అంతా మనము కరోనా కారణంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కి దూరం అయ్యాము. ముఖ్యంగా థియేటర్లో చూసే సినిమాలకు బాగా అలవాటు పడిన మన తెలుగు ప్రేక్షకులు, థియేటర్లు మూతబడడంతో ఢీలా పడిపోయారు. దాని తరువాత కేంద్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొంతమేర ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తరువాత 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుండి మళ్లీ సినిమాల జోరు కొనసాగుతోంది. మీకు తెలిసిందే మనకున్న అన్ని సినీ పరిశ్రమల్లో తెలుగు సినీ పరిశ్రమ లో ఎక్కువగా హడావిడి ఉంటుంది.tollywood-movies-results;auto;kumaar;karthikeya;kartikeya;manchu vishnu;vishnu;adinarayanareddy;tollywood;industries;cinema;cinema theater;2020;film industry;letter;success;central government;sai kumar;chitram2021 లో టాలీవుడ్ కి షాకిచ్చిన ఫస్ట్ ఫ్రైడే ఇదే...!2021 లో టాలీవుడ్ కి షాకిచ్చిన ఫస్ట్ ఫ్రైడే ఇదే...!tollywood-movies-results;auto;kumaar;karthikeya;kartikeya;manchu vishnu;vishnu;adinarayanareddy;tollywood;industries;cinema;cinema theater;2020;film industry;letter;success;central government;sai kumar;chitramSat, 20 Mar 2021 14:00:00 GMT
2020 సంవత్సరం అంతా మనము కరోనా కారణంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కి దూరం అయ్యాము. ముఖ్యంగా థియేటర్లో చూసే సినిమాలకు బాగా అలవాటు పడిన మన తెలుగు ప్రేక్షకులు, థియేటర్లు మూతబడడంతో ఢీలా పడిపోయారు. దాని తరువాత కేంద్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొంతమేర ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు.  ఆ తరువాత 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో అప్పటి నుండి మళ్లీ సినిమాల జోరు కొనసాగుతోంది. మీకు తెలిసిందే మనకున్న అన్ని సినీ పరిశ్రమల్లో తెలుగు సినీ పరిశ్రమ లో ఎక్కువగా హడావిడి ఉంటుంది. ఇక అప్పటి నుండి ప్రతి శుక్రవారం కనీసం మూడు నాలుగు సినిమాలకు తగ్గకుండా విడుదల చేస్తూ వస్తున్నారు.  ప్రేక్షకులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా థియేటర్లకు కోకొల్లలుగా వచ్చి సినిమాలను ఎప్పటిలాగే ఆదరిస్తున్నారు.  

సినిమా ఎలా ఉన్నా కానీ పట్టించుకోకుండా ఇన్ని రోజుల తమ సినిమా ఆకలిని తీర్చుకుంటున్నారు. కాబట్టి యావరేజ్ సినిమాలు సైతం మంచి  కలెక్షన్ లను రాబడుతున్నాయి. అయితే ఎప్పటి లాగే నిన్న శుక్రవారం కావడంతో మూడు సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి. వీటిలో మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్ళు...ఈ సినిమా యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కింది. ముందు నుండి ప్రేక్షకుల్లో మంచి హైప్ రాబట్టినా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని రివ్యూ క్రిటిక్స్ చెబుతున్నారు. దీనితో ఈ సారి మంచు విష్ణుకి గెలుపు దక్కలేదు.  అదే విధంగా కార్తికేయ విభిన్న పాత్రలో నటించిన  చావు కబురు చల్లగా మూవీ కూడా పాటలు ట్రైలర్ ఆకట్టుకోవడంతో మూవీ యూనిట్ ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. 

కానీ కథ బాగున్నా డీల్ చేసే విధానం సరిగా లేకపోవటంతో ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేదని టాక్.  చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ 'శశి' కూడా నిన్నే విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ఏవరేజ్ గా నిలవడంతో...2021 సంవత్సరంలో శుక్రవారం విడుదలయిన  సినిమాలతో పోలిస్తే, ఒకటి కూడా హిట్ కాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమాల ఓపెనింగ్ వసూళ్లు కూడా అంతంత మాత్రమే అని ట్రేడర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ శుక్రవారం...ఒక చెత్త రోజుగా మిగిలిపోయింది.




కీర్తి సురేష్ కి ఈసారి కూడా లవ్ స్టోరీ కలిసొస్తుందా

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>