PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilandu-elections-there-is-no-cinima-glamar-e71a3786-905b-4531-94ef-9ac30df0ed20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilandu-elections-there-is-no-cinima-glamar-e71a3786-905b-4531-94ef-9ac30df0ed20-415x250-IndiaHerald.jpgరీల్ హీరోలు ఏమైనా చేయగలరు. కానీ అది సినిమా హాలు తెర మీద, ఆ నాలుగు గోడల మధ్యనే. అది దాటితే వారూ మనుషులే. ఇక రియల్ లైఫ్ లో హీరోయిజం చేసేవారు కూడా ఉన్నారు. కానీ అక్కడా ఇక్కడా వీర రసాన్ని పండించే వారు బహు కొద్ది మంది. cinima;kamal hassan;kumaar;jayalalitha;manu;radhika;sarath kumar;sharath;suhasini;udhayanidhi stalin;vishwa;m. karunanidhi;cinema;tamil;chief minister;tamilnadu;aqua;stalin;sharrath marar1;partyసినిమా మోజు వర్కౌట్ అవుతుందా...?సినిమా మోజు వర్కౌట్ అవుతుందా...?cinima;kamal hassan;kumaar;jayalalitha;manu;radhika;sarath kumar;sharath;suhasini;udhayanidhi stalin;vishwa;m. karunanidhi;cinema;tamil;chief minister;tamilnadu;aqua;stalin;sharrath marar1;partyFri, 19 Mar 2021 22:00:00 GMTసినిమా హాలు తెర మీద, ఆ  నాలుగు గోడల మధ్యనే. అది దాటితే వారూ మనుషులే. ఇక రియల్ లైఫ్ లో హీరోయిజం చేసేవారు కూడా ఉన్నారు. కానీ అక్కడా ఇక్కడా వీర రసాన్ని పండించే వారు బహు కొద్ది మంది.

మన దేశంలో సినిమా స్టార్లకు పూజలు చేసి వారిని ఆరాధించే వెర్రి అభిమానం తమిళనాడులో ఉన్నంతంగా ఎక్కడా లేదు. అందుకే ఆ రాష్ట్రంలో వరసపెట్టి సినిమా వారు అనేక సార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. అయితే అయిదేళ్ల క్రితం కనిపించిన సినీ గ్లామర్ ఇపుడు తమిళనాట లేదు అనే చెప్పాలి. నాటి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించారు. ఆమె తరువాత ఏడాదికి కరుణానిధి కూడా కాలం చేశారు. ఇపుడు తమిళనాడులో సినిమా గ్లామర్ తో సంబంధం లేని పార్టీలుగా డీఎంకే, అన్నాడీఎంకే ఉన్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ జనాలనే నమ్ముకున్నారు. తన పార్టీ సిధ్ధాంతాలనే ప్రచారం చేస్తూ ఆయన జనంలోకి వస్తున్నారు.

మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే మళ్ళీ గెలిచేందుకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు, అభివృద్ధినే నమ్ముకున్నారు. ఇలా ప్రధానమైన రెండు పార్టీలలో సినీ కళ ఎక్కడా కానరావడంలేదు. కానీ విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రం పార్టీ పెట్టి తన సినీ గ్లామర్ ని పెట్టుబడిగా చేసుకున్నాడు. ఆయన పార్టీతో జట్టు కట్టిన మరో సినీ నటుడు శరత్ కుమార్ కూడా అభిమానులు  ఓట్లు రాల్చకపోతారా అని ఎదురుచూస్తున్నారు. ఆయన సతీమణి రాధిక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇక ఈ కూటమికి కమల్ హాసన్ అన్న కూతురు సుహాసిని ప్రచారం చేస్తోంది. ఇలా సినీ గ్లామర్ మీద పూర్తిగా ఆధారపడింది ఈ కూటమి. మరి తమిళులు సినీ గ్లామర్ మీద ఇంకా మోజు పెంచుకుంటే ఈ కూటమినే గెలిపించాలి. కానీ సీన్ చూస్తే అలా కనిపించడంలేదు. అయితే డీఎంకే లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగానే ఉంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే తమిళ నాట తళుకుబెళుకులకు కాలం చెల్లింది అని.





వకీల్ సాబ్ లో ఆ ఒక్క లెక్క తప్పుతుందా..?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>