PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna8852a824-6a51-44ec-9433-5555d0133350-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna8852a824-6a51-44ec-9433-5555d0133350-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా.. ఇప్పుడు ఇదే అత్యంత పవర్‌ఫుల్ మీడియా.. ఈ విషయాన్ని తీన్మార్ మల్లన్న మరోసారి రుజువు చేశాడు.. కోట్ల కుమ్మరించే పార్టీ అండదండలు లేకున్నా.. తనకంటూ ఓ బలమైన అనుచరవర్గం లేకున్నా.. కోట్లు పెట్టగలిగే సత్తా లేకున్నా.. అతనొక్కడే సైన్యమై వారెవా అనిపిస్తున్నాడు. అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు. అతడే తీన్మార్ మల్లన్న. అవును మరి.. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తీన్మార్ మల్లన పెను సంచలనమే సృష్టిస్తున్నాడు. తీన్మార్ మల్లన్న.. అతడికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లteenmar-mallanna;warangal;congress;media;nalgonda;youtube;you tube;nijam;partyతీన్మార్‌ మల్లన్న.. ఆడు మగాడ్రా బుజ్జీ..? తస్సాదియ్యా..!?తీన్మార్‌ మల్లన్న.. ఆడు మగాడ్రా బుజ్జీ..? తస్సాదియ్యా..!?teenmar-mallanna;warangal;congress;media;nalgonda;youtube;you tube;nijam;partyFri, 19 Mar 2021 08:00:00 GMTపార్టీ అండదండలు లేకున్నా.. తనకంటూ ఓ బలమైన అనుచరవర్గం లేకున్నా.. కోట్లు పెట్టగలిగే సత్తా లేకున్నా.. అతనొక్కడే సైన్యమై వారెవా అనిపిస్తున్నాడు. అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు. అతడే తీన్మార్ మల్లన్న. అవును మరి.. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తీన్మార్ మల్లన పెను సంచలనమే సృష్టిస్తున్నాడు.


తీన్మార్ మల్లన్న.. అతడికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవు. అతడికి ఏ యూనియన్ మద్దతు లేదు. సినీ గ్లామర్ లేదు. కోట్ల కొద్దీ ఆస్తులు లేవు. ఒక సాధారణ మధ్యతరగతి మనిషి. ఓ సత్తా ఉన్న జర్నలిస్టు.. దమ్మూ ధైర్యం ఉన్న యువకుడు. తాను నమ్మినదాన్ని బలంగా వినిపించే పాత్రికేయుడు. ప్రభుత్వానికి సైతం తలవంచకుండా ఏకిపారేసే నిఖార్సైన జర్నలిస్టు.. ఇప్పుడు ఆ ధైర్యమే తీన్మార్ మల్లన్నకు ఓట్లు కురిపిస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా అధికార పార్టీ అభ్యర్థికి దడ పుట్టించేలా ఓట్లు సంపాదిస్తున్నాడు.


కేవలం జర్నలిజం నమ్ముకుని యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తికి ఇంత ఫాలోయింగా? తప్పు నిర్ణయాలను తుర్పారా పెట్టే ఓ సామాన్యుడికి ఇంత క్రేజా? రాజకీయ పార్టీల అభ్యర్థులు దరిదాపుల్లో లేరు. వంద కోట్ల రూపాయలు కుమ్మరించి గెలవాలని చూస్తున్న అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్న మల్లన్న నిజంగా  ఓ రాజకీయ విప్లవంగానే చెప్పాలి. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కాలేదు. ఈ ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలవచ్చు.. గెలవకపోవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న అక్షరాలా సంచలనమే సృష్టించాడు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించాడు.


తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓ సారి పోటీ చేశాడు. కానీ అప్పుడు నామ్‌ కే వాస్తే గా పోటీలో కనిపించాడు. కానీ ఇప్పుడు అతని హవా మామూలుగా లేదు. చివరకు కోదండరామ్‌ను సైతం అధిగమించేశాడు. ఇక తీన్మార్ మల్లన్న గెలిస్తే..అదో పెను సంచలనమే అవుతుంది.




కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>