Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-loka-saba21d74acd-a7c2-478a-a2de-3b2a4f654e47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-loka-saba21d74acd-a7c2-478a-a2de-3b2a4f654e47-415x250-IndiaHerald.jpg మనం మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని ఉదాహరణగా శత్రువులు మిత్రులు అవుతుంటారు అని అంటుంటాం. అయితే సందర్భాన్ని బట్టి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంలో కానీ, లేదా మరేదైనా సందర్భం వచ్చినప్పుడు కొందరు శత్రువులు మిత్రులు అవుతుంటారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటుంటారు. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో కొత్త కొత్త పొత్తులు వెలుస్తున్నాయి. అధికార వైసీపీకి ఊహించని మద్దతు లభించింది. వివరాల్లోకి వెళితే.. tirupathi loka saba;cbn;mithra;tiru;district;tirupati;parliment;husband;tdp;central government;ycp;cpi;v;party;shatru1కొత్త పొత్తులు వెలుస్తున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు...?కొత్త పొత్తులు వెలుస్తున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు...?tirupathi loka saba;cbn;mithra;tiru;district;tirupati;parliment;husband;tdp;central government;ycp;cpi;v;party;shatru1Fri, 19 Mar 2021 00:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో కొత్త కొత్త పొత్తులు వెలుస్తున్నాయి. అధికార వైసీపీకి ఊహించని మద్దతు లభించింది. వివరాల్లోకి వెళితే..


తిరుప‌తిలో ఉప ఎన్నిక‌లో వైసీపీకి సీపీఐ మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అనుబంధ పార్టీగా పేరున్న సీపీఐ నుంచి మ‌ద్దతు ల‌భించ‌నుంద‌నే స‌మాచారంతో వైసీపీ షాక్‌కు గుర‌వుతోంది. సీపీఐ అనూహ్య నిర్ణయం తీసుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలూ లేక‌పోలేదు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక బ‌రిలో సోద‌ర వామ‌ప‌క్ష పార్టీ సీపీఎం త‌మ అభ్యర్థిని నిన్న ప్రక‌టించింది. నెల్లూరు యాద‌గిరి అభ్యర్థిత్వాన్ని సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు వి.శ్రీ‌నివాసులు ప్రక‌టించారు. అయితే అభ్యర్థి ఎంపిక ఏక‌ప‌క్షంగా జ‌రిగింద‌ని, మాట మాత్రం కూడా త‌మ‌తో చ‌ర్చించ‌కుండా అభ్యర్థిని ప్రక‌టిస్తే తామెలా మ‌ద్దతిస్తామంటూ సీపీఐ అసంతృప్తిలో ఉంది. దీంతో సీపీఎంకు రెడ్‌సిగ్నల్ ఇచ్చింది.
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీపీఐ అండర్‌‌స్టాండింగ్‌తో పొత్తు కుదుర్చుకున్నాయి.


అయితే.కొన్ని చోట్ల టీడీపీ పొత్తు ధ‌ర్మాన్ని పాటించ‌క‌పోవ‌డంతో సీపీఐ అగ్రనేత‌లు ఆగ్రహంగా ఉన్నారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌, చిత్తూరు జిల్లా తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో టీడీపీ పొత్తు ధ‌ర్మాన్ని ఖాత‌రు చేయ‌కుండా సీపీఐ అభ్యర్థులున్న చోట మ‌ద్దతు ఇవ్వకుండా స్వయంగా బరిలోకి దిగింది. తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలోని 3వ డివిజ‌న్‌లో టీడీపీ తిరుప‌తి పార్లమెంట్ ఇన్‌చార్జ్ న‌ర‌సింహ‌యాద‌వ్ త‌మ్ముడు బ‌రిలో నిలిచాడు. ఇదే డివిజ‌న్ నుంచి సీపీఐ త‌న అభ్యర్థిని నిలిపింది. పోటీ నుంచి త‌ప్పుకుని మ‌ద్దతు ఇవ్వాల‌ని సీపీఐ అగ్రనేత నారాయ‌ణ ప్రాధేయ‌ప‌డినా వినిపించుకోలేదు.



దీంతో నారాయ‌ణ టీడీపీ నేత‌ల‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు.అందుకే  ఇంత కాలం చంద్రబాబుకు లెప్ట్ అండ్ రైట్‌గా వ్యవహరిస్తూ వస్తున్న రామ‌కృష్ణ, నారాయ‌ణ మాట‌ల్లో ఇటీవ‌ల వ‌చ్చిన మార్పును గ‌మ‌నించాల్సి ఉంది. ప్రజాద‌ర‌ణ ప‌క్కన పెడితే టీడీపీ అనుబంధ పార్టీగా ముద్రప‌డిన సీపీఐ నుంచి అనూహ్య మ‌ద్దతు ల‌భిస్తుంద‌న్న సంకేతాలు వైసీపీని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ పొత్తు పొడిచి కలిసి బరిలోకి దిగుతారా..? లేక వైసీపీ సింగిల్‌గానే పోటీకి వెళ్తుందా..? అనేది చూడాలి.


ఎప్పుడైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి....

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>