HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health2b94c946-cf78-4da7-bb9b-4b40c5d065b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health2b94c946-cf78-4da7-bb9b-4b40c5d065b7-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడో లేక జ్వరంతో బాధపడుతున్నప్పుడో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. కాని ఎలా వేసుకుంటున్నామో ఏ విధంగా వేసుకుంటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇక మనం టాబ్లెట్స్ ని ఎలా వేసుకుంటాము. సాధారణంగా ఎటువంటి ట్యాబ్లెట్లనైనా మంచి నీటితో వేసుకుంటాం. అయితే కొంత మంది మాత్రం గోరు వెచ్చని నీటితో మాత్రలు వేసుకునేందుకు ఇష్టపడతారు. దీని వల్ల మందులు బాగా పని చేస్తాయని నమ్ముతుంటారు. ఐతే.. నేరుగా మాత్రలను వేసుకునే కంటే గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటయని పలు Health;poorna;mandula;heart;coffeeఎప్పుడైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి....ఎప్పుడైనా టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి....Health;poorna;mandula;heart;coffeeFri, 19 Mar 2021 00:00:00 GMTసాధారణంగా మనం ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడో లేక జ్వరంతో బాధపడుతున్నప్పుడో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. కాని ఎలా వేసుకుంటున్నామో ఏ విధంగా వేసుకుంటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇక మనం టాబ్లెట్స్ ని ఎలా వేసుకుంటాము. సాధారణంగా ఎటువంటి ట్యాబ్లెట్లనైనా మంచి నీటితో వేసుకుంటాం. అయితే కొంత మంది మాత్రం గోరు వెచ్చని నీటితో మాత్రలు వేసుకునేందుకు ఇష్టపడతారు. దీని వల్ల మందులు బాగా పని చేస్తాయని నమ్ముతుంటారు. ఐతే.. నేరుగా మాత్రలను వేసుకునే కంటే గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటయని పలు పరిశోధనల్లో తేలింది. దాదాపు 50 మంది వలంటర్లలో సగం మందికి సాధారణ నీటితో మాత్రలు వేయించారు. మిగతా సగం మందికి గోరు వెచ్చని నీటిలో అవే మాత్రలను పొడి చేసి కలిపేసి ఇచ్చారు. కొద్ది గంటల తర్వాత వీరి రక్త నమూనాలను సేకరించి పరీక్షించి చూడగా.. గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకున్న వారి రక్తంలో త్వరగా కలిసినట్టు గుర్తించారు.చల్లని నీటితో వేసుకునే మాత్రలు శరీరంలో కరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే.. సాధారణ ట్యాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటే గోరు వెచ్చని నీటిలో ఓ ట్యాబ్లెట్ పడేసి కాసేపు ఆగి ఆ నీటిని తాగితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకుంటే త్వరగా చిన్న పేగులోకి వెళ్తుందట.


 ఫలితంగా రక్తంలోకి క్షణాల్లో కలుస్తుందట. అందుకే.. మాత్రలు మింగడానికి మనం ఉపయోగించే ద్రవ పదార్థాల విషయంలో కచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలా అని ఆ జ్యూసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ట్యాబ్లెట్లు పని చేయవు సరికదా కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. గుండె సంబంధ సమస్యలకు వాడే మాత్రలను పండ్ల రసాలతో వేసుకుంటే పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందట. ఇక.. కొంత మంది ఎటువంటి ద్రవ పదార్థాలు లేకుండా నేరుగా ట్యాబ్లెట్లను మింగేస్తుంటారు. ఇలా కూడా చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


ఇలా నేరుగా మాత్రలు మింగివారికి ఛాతీలో మంట, గుండె దడ, రక్త ప్రసరణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయట.మాత్రలు వేసుకునేందుకు చిన్న పిల్లలు మారాం చేస్తే కొంత మంది పేరెంట్స్.. పాలు లేదా బాదం మిల్క్‌తో వాటిని వేయడానికి ప్రయత్నిస్తారు. సహజంగానే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. ఐతే.. పాలు, టీ, కాఫీతో మాత్రలు వేసుకోవడం ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీలతో మాత్రలు వేసుకుంటే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయట. యాంటీ బయోటిక్స్ వంటి కొన్ని రకాల మాత్రలు పాలులో వేసుకుంటే పూర్తి ప్రభావ రహితంగా మారిపోతాయట.కాబట్టి టాబ్లెట్స్ వేసుకునేముందు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి...



అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>