Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/menthiaakud3ba21bc-66e1-451a-b1ff-33829ba93762-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/menthiaakud3ba21bc-66e1-451a-b1ff-33829ba93762-415x250-IndiaHerald.jpgభారతీయ వంటకాల్లో మెంతులు, మెంతి ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని కస్తూరి మేధీ అని కూడా అంటారు. భారతీయ ఆయుర్వేద లో మెంతి ఆకును అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గంగా చూపబడిందిమనదేశంలో మెంతులకంటే మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మెంతికూర చక్కని రుచి ఇవ్వడంతోపాటు మన నిత్య జీవితానికి అవసరమైన అనేక పోషక విలువలను మన శరీరానికి అందించి, మనం పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండునట్లు చేస్తుంది. మెంతికూరను ఆహారంలో ఉపయోగించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షింmenthiaaku;kasthuri;nithya new;rasam;vitamin c;vitamin;heart;sugar;ayurveda;insulin;chris lynnమెంతి ఆకుల రసం ప్రతి రోజూ సేవిస్తే ఏమవుతుందో తెలుసా..!!మెంతి ఆకుల రసం ప్రతి రోజూ సేవిస్తే ఏమవుతుందో తెలుసా..!!menthiaaku;kasthuri;nithya new;rasam;vitamin c;vitamin;heart;sugar;ayurveda;insulin;chris lynnFri, 19 Mar 2021 09:00:00 GMTకస్తూరి మేధీ అని కూడా అంటారు. భారతీయ ఆయుర్వేద లో మెంతి ఆకును అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గంగా చూపబడిందిమనదేశంలో మెంతులకంటే మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. మెంతికూర చక్కని రుచి ఇవ్వడంతోపాటు మన నిత్య జీవితానికి అవసరమైన అనేక పోషక విలువలను మన శరీరానికి అందించి, మనం పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండునట్లు చేస్తుంది. మెంతికూరను ఆహారంలో ఉపయోగించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది. నిత్యం ఆహారంలో మెంతికూర ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోనీ కొలెస్ట్రాల్నీ నియంత్రించి అధిక బరువు సమస్య నుంచి బయటపడటమే కాకుండా గుండె పనితీరు మెరుగు పరుస్తుంది.

మెంతి ఆకులో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడటంలో కీలకపాత్ర వహిస్తుంది.

మెంతి ఆకుల్లో ఇనుము, విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీనిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

ముఖ్యంగా కామెర్ల సమస్యతో బాధపడేవారు, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి  రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.

నిత్యం నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను తీసుకొని రసం తీసి భోజనానికి ముందు ఒక గ్లాస్ తీసుకుంటే అందులో ఉండే సుగుణాలు సుఖ నిద్రను కలిగింప చేస్తాయి.

షుగర్ వ్యాధి గ్రస్తులకు మెంతి ఆకులు చక్కటి పరిష్కార మార్గం. మెంతి రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి ఇన్సులిన్ని ప్రోత్సహిస్తుంది. దాంతో ఇన్సులిన్ బాగా అభివృద్ధి చెంది షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి. మెంతి ఆకు రసములు నిమ్మకాయ పిండి ప్రతి రోజూ సేవిస్తే షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు.

జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు మెంతి ఆకులను మెత్తగా చేసి గుజ్జును తలకు అంటించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.  ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇంకా అనేక చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.


భూమ‌న‌కు జ‌గ‌న్ భారీ షాక్‌.. వార‌సుడిని ప్రోత్స‌హించలేదా ?

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?

బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>