MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-halls794fa1a9-f309-4239-998c-226870e514b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema-halls794fa1a9-f309-4239-998c-226870e514b9-415x250-IndiaHerald.jpg2020 వ సంవత్సరం చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. కరోనా కారణంగా సినిమాల బిజినెస్ పూర్తిగా ఆగిపోయింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోవడంతో నిర్మాతలు, దర్శకులు, కళాకారులు ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే కరోనా వ్యాప్తి తగ్గటంతో ఇప్పుడిప్పుడే చిత్రసీమ మళ్లీ కుదుటపడుతుంది. ప్రస్తుతం సినిమా థియేటర్లు 100% ఆక్యుపెన్సీ తో నడుస్తున్నాయి. దీంతో సినీ నిర్మాతలు తమ మూవీస్ ని వరుసపెట్టి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఉప్పెన, జాతిరత్నాలు బ్లాక్ బస్టర్cinema halls;business;pawan;chiranjeevi;ntr;venkatesh;balakrishna;ram charan teja;amala akkineni;kalyan;ram pothineni;varsha;india;tollywood;cinema;2020;blockbuster hit;cinema theatre;central government;june;nandamuri taraka rama rao;marchసినిమా హాల్స్ మళ్లీ మూసి వేస్తారా..సినిమా హాల్స్ మళ్లీ మూసి వేస్తారా..cinema halls;business;pawan;chiranjeevi;ntr;venkatesh;balakrishna;ram charan teja;amala akkineni;kalyan;ram pothineni;varsha;india;tollywood;cinema;2020;blockbuster hit;cinema theatre;central government;june;nandamuri taraka rama rao;marchFri, 19 Mar 2021 17:00:00 GMT2020 వ సంవత్సరం చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. కరోనా కారణంగా సినిమాల బిజినెస్ పూర్తిగా ఆగిపోయింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోవడంతో నిర్మాతలు, దర్శకులు, కళాకారులు ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్కరూ  ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే కరోనా వ్యాప్తి తగ్గటంతో ఇప్పుడిప్పుడే చిత్రసీమ మళ్లీ కుదుటపడుతుంది. ప్రస్తుతం సినిమా థియేటర్లు 100% ఆక్యుపెన్సీ తో నడుస్తున్నాయి. దీంతో సినీ నిర్మాతలు తమ మూవీస్ ని వరుసపెట్టి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఉప్పెన, జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీనితో తెలుగు చిత్ర పరిశ్రమకి మళ్లీ ఊపు వచ్చింది.


మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలా ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్త సినిమాను చూసేందుకు తహతహలాడుతున్నారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిరోజు వందల, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.


అలా జరిగితే ముందస్తుగా థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు మూసివేస్తారు. ప్రజలు రద్దీగా తిరిగే ఈ ప్రాంతాలు కరోనా కేసుల పెరగడానికి కారణం అవుతాయి కాబట్టి వీటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సినిమా హాల్స్ మూసివేస్తే మళ్ళీ టాలీవుడ్ కుదేలవ్వడం ఖాయం. అయితే కొందరు నిర్మాతలు తమ సినిమాలు త్వరగా విడుదల చేసి కనీస వసూళ్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. మరి త్వరలో కరోనా ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టి థియేటర్లను మూసివేయాలని నిర్ణయిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.


ఓవర్సీస్ లో 1 మిలియన్ దగ్గరికి వచ్చిన జాతిరత్నాలు

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>