Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pasupu-vadithe-depression-ki-check-pettavachhab74958a8-372f-4893-8e8c-9a03349f4419-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pasupu-vadithe-depression-ki-check-pettavachhab74958a8-372f-4893-8e8c-9a03349f4419-415x250-IndiaHerald.jpgభారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి.పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్ ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, డయాబెటిస్ , మరియు అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. ఇది ఎంతవరకు నిజం? అంతేకాక మీరు ఎన్నో సందర్భాల్లో పసుపు గాయాలను తగ్గిస్తుందని, సౌందర్య ఉత్పత్తులలో వాడతారనీ, చర్మ సౌందర్యానికి పరమ ఔషధమనీ విని ఉంటారు. pasupu;soundarya;india;brazil;iron;vitamin;turmeric;sugar;cheque;ayurveda;protein;ee rojulloపసుపు వాడితే డిప్రెషన్ కీ చెక్ పెట్టవచ్చా...?పసుపు వాడితే డిప్రెషన్ కీ చెక్ పెట్టవచ్చా...?pasupu;soundarya;india;brazil;iron;vitamin;turmeric;sugar;cheque;ayurveda;protein;ee rojulloFri, 19 Mar 2021 08:00:00 GMTడయాబెటిస్ , మరియు అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. ఇది ఎంతవరకు నిజం? అంతేకాక మీరు ఎన్నో సందర్భాల్లో పసుపు గాయాలను తగ్గిస్తుందని, సౌందర్య ఉత్పత్తులలో వాడతారనీ, చర్మ సౌందర్యానికి పరమ ఔషధమనీ విని ఉంటారు.


ఈ రోజుల్లో చిన్న, పెద్ద, అని తేడా లేకుండా స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. మానసిక వైద్య నిపుణుల వద్దకు చికిత్సకు వెళ్తుంటారు. కొంతమందికి కౌన్సెలింగ్ ద్వారా వీటిని నయం చేయవచ్చు. మరికొంత మందికి యాంటీ - డిప్రెసెంట్ మెడిసిన్‌ను వైద్యులు సూచిస్తారు. ఐతే  వీటన్నిటి కంటే ముందుగా మన జీవన విధానంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మానసిక ఆందోళనకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.


మానసిక, శారీరక ఆరోగ్యానికి విటమిన్ - డి చాలా అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక సమస్యలు అధికంగా కనిపిస్తాయి. అందుకే.. డిప్రెషన్‌‌కు ఎక్కువగా గురయ్యే వారు విటమిన్‌ - డి స్థాయిని పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అమెరికాలో దాదాపు 77 శాతం మంది ప్రజల్లో విటమిన్ డి లోపం ఉందని పలు అధ్యయనాల ద్వారా తేలింది. తరచూ అలసటగా అనిపించడం, జుట్టు రాలడం, కండరాల నొప్పులు కూడా విటమిన్‌ - డి లోపం ఉండే వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు, పుట్ట గొడుగులు, గుడ్డు, తృణధాన్యాల్లో విటమిన్‌ - డి పుష్కలంగా ఉంటుంది. వీటితోపాటు నట్స్‌, ఆయిల్‌ సీడ్స్‌లో కూడా విటమిన్‌ - డి ఉంటుంది. అందుకే వీటిని రోజు వారీ డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి.


రోజువారీ ఆహారంలో పసుపును చేర్చుకుంటే మానసిక ఆందోళన దరి చేరదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడు సంబంధ వ్యాధి ‘ఆల్జీమర్స్’ చికిత్సకు పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారట. స్ట్రెస్, డిప్రెషన్, మానసిక ఆందోళన తగ్గించడంలోనూ పసుపు సమర్థవంతంగా పని చేస్తుంది. పార్కిన్సన్ వంటి అనేక వ్యాధులను దూరం చేయడానికి కూడా పసుపు సహకరిస్తుంది. ఇక  యాంటీ బయోటిక్‌గానూ పసుపు పని చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.


ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్, కాల్షియం, సెలీనియం, విటమిన్ - ఇ, విటమిన్ బి - 6 అత్యధికంగా ఉండే ‘బ్రెజిల్ నట్స్’ తింటే మానసిక స్థితి మెరుగుపడి ఆందోళన తగ్గడానికి తోడ్పతుడుంది. చాలా టేస్టీగా ఉండే డార్క్ చాక్లెట్‌ను ఆందోళనలో ఉన్నప్పుడు తీసుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుందట. రక్త ప్రసరణ మెరుగుపడి న్యూరో ఇన్ ఫ్లమేషన్‌ను కూడా తగ్గిస్తుందట.


ఆ బాధ్యతలు రేవంత్ కి ఇచ్చేసారా...?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>