ViralGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/latest-news-breaking-news279c307a-2904-4eb5-bd65-9e8173e0863a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/latest-news-breaking-news279c307a-2904-4eb5-bd65-9e8173e0863a-415x250-IndiaHerald.jpgచ‌రిత్ర‌కు సంబంధించి మ‌నం ఏ విష‌యం చెప్పాల‌నుకున్నా క్రీస్తు పూర్వం, క్రీస్తు శ‌కం అని చెబుతుంటాం. అలాగే ఇక‌నుంచి న‌మ స‌మాజంలో జ‌రిగే మార్పులు, ఇత‌ర‌త్రా విష‌యాల గురించి చెప్పాలంటే.. క‌రోనాకు ముందు.. క‌రోనా త‌ర్వాత అని చెప్ప‌వ‌చ్చు. కరోనా మహమ్మారి వ‌ల్ల‌ ఆటోమేషన్ పెరుగుతుంద‌ని, వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని 40 శాతం మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భారత్, చైనా సహా 19 దేశాల నుంచి 32,500 మందితో జనవరి 26-ఫిబ్రవరి 8 మధ్య పీడబ్ల్యూసీ స‌ర్వే నిర్వ‌హించింది. latest news, breaking news;india;january;februaryఉద్యోగం ఉంటుందా?... పోతుందా?...ఉద్యోగం ఉంటుందా?... పోతుందా?...latest news, breaking news;india;january;februaryFri, 19 Mar 2021 06:54:17 GMTజనవరి 26-ఫిబ్రవరి 8 మధ్య పీడబ్ల్యూసీ స‌ర్వే నిర్వ‌హించింది. మారుమూల ప్రాంతాల నుంచి (రిమోట్ వర్కింగ్) పని చేసేందుకు మ‌న‌ల్ని మ‌నం మార్చుకోవ‌డం కూడా  ప్రమాదకర పరిణామ‌మేన‌ని ఉద్యోగులు భావిస్తున్న‌ట్లు తెలిపింది. స‌ర్వేకు సంబంధించిన విష‌యాలు ఒక‌సారి ప‌రిశీలిద్దాం...

ఆటోమేష‌న్‌తో ఉద్యోగాల‌కు ముప్పు

* ఆటోమేషన్‌తో ఎక్కువ‌ ఉద్యోగాలకు ప్రమాదం పొంచిఉందని 60 శాతం మంది పేర్కొన్నారు. సంప్రదాయ ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చని 48 శాతం మంది చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు.
* లాక్‌డౌన్‌లో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40% మంది వెల్లడించ‌గా, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77% మంది సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.
* పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతల్ని స్వీకరించడానికి 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. భారత్‌లో 69 శాతం మంది, దక్షిణాఫ్రికాలో 66 శాతం మంది ఈ విషయంలో చాలా ఆత్మ‌విశ్వాసాన్ని క‌న‌ప‌రిచారు.
*  సొంతంగా వ్యాపారం స్థాపించాలనే ఆసక్తితో నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై 49% మంది దృష్టి సారిస్తున్నారు.
* పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వల్ల కెరీర్ పురోగతి, శిక్షణ కోల్పోతున్నామని 50 శాతం మంది చెప్పారు. లింగ వివక్ష ఉందని 14 శాతం, జాతి వివ‌క్ష ఉంద‌ని 13 శాతం మంది మంది వెల్లడించారు.
* సమాజానికి సహకరించే సంస్థల్లో పని చేయాలని 75% మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు. దీనివ‌ల్ల త‌మ‌కు ఆదాయంతోపాటు స‌మాజానికి చేత‌నైనంత‌లో స‌హాయం చేసిన‌ట్లుగా ఉంటుంద‌ని, ఆత్మ తృప్తి క‌లుగుతుంద‌ని చెప్పారు.




బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>