ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralec281945-6fa9-46e6-85b7-228bc41e81fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralec281945-6fa9-46e6-85b7-228bc41e81fd-415x250-IndiaHerald.jpgసెక్స్ టాయ్స్ గురించి వినే ఉంటారు. భావ ప్రాప్తి కోసం ఈ టాయ్స్ ని చాలా మంది కొనుగోలు చేస్తారు. ఇక విదేశాల్లో ఈ సెక్స్ టాయ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇండియాలో కూడా పెద్ద పెద్ద నగరాల్లో వినియోగదారులు రహస్యంగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని వీటిని తెప్పించుకొని వాడుతూ ఉంటారు. అయితే బహిరంగంగా బయట అయితే ఇలాంటి స్టోర్లు పెట్టరు. కాని తొలిసారి ఇండియా లో ఈ సెక్స్ టాయ్స్ స్టోర్ ని పెట్టారు.గోవాలోని కలాంగూట్‌కు చెందిన ఓ వ్యాపారి ‘కామా గిజ్మోస్’ పేరుతో సెక్స్ టాయ్స్, వెల్‌నెస్ ప్రొడక్టులను విక్రయిస్తునViral;ganga;ganges;india;media;panchayati;village;february;sex;local language;applicationవైరల్ : కేవలం నెల రోజుల్లోనే ఆ సెక్స్ టాయ్స్ స్టోర్ ని మూసి వేయించిన స్థానికులు.....వైరల్ : కేవలం నెల రోజుల్లోనే ఆ సెక్స్ టాయ్స్ స్టోర్ ని మూసి వేయించిన స్థానికులు.....Viral;ganga;ganges;india;media;panchayati;village;february;sex;local language;applicationFri, 19 Mar 2021 23:00:00 GMTసెక్స్ టాయ్స్ గురించి వినే ఉంటారు. భావ ప్రాప్తి కోసం ఈ టాయ్స్ ని చాలా మంది కొనుగోలు చేస్తారు. ఇక విదేశాల్లో ఈ సెక్స్ టాయ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇండియాలో కూడా పెద్ద పెద్ద నగరాల్లో వినియోగదారులు రహస్యంగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని వీటిని తెప్పించుకొని వాడుతూ ఉంటారు. అయితే బహిరంగంగా బయట అయితే ఇలాంటి స్టోర్లు పెట్టరు. కాని తొలిసారి ఇండియా లో ఈ సెక్స్ టాయ్స్ స్టోర్ ని పెట్టారు.గోవాలోని కలాంగూట్‌కు చెందిన ఓ వ్యాపారి ‘కామా గిజ్మోస్’ పేరుతో సెక్స్ టాయ్స్, వెల్‌నెస్ ప్రొడక్టులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుంచి వీటి విక్రయం మొదలుపెట్టాడు. సెక్స్ టాయ్స్‌కు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకొని ఈ స్టోర్ ప్రారంభించారు. ఇందులో కేవలం సెక్స్ టాయ్స్ మాత్రమే కాకుండా వయాగ్రా తరహా స్ప్రేలు, నావెల్టీ కండోమ్స్, జెల్స్, వైబ్రేటర్లు, పంపులు తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ఈ షాప్ గురించి ఇటీవల మీడియాలో బాగా ప్రచారం జరిగింది.



దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు కలాంగూట్ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో కలాంగూట్‌ సర్పంచ్ ఇలాంటివి ఇక్కడ విక్రయించడానికి వీల్లేదంటూ స్టోరును మూయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దినేష్ సిమేపురస్కార్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై మాకు కొందరు ఫిర్యాదు చేశారు. పైగా ఈ స్టోర్‌కు ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు’’ అని తెలిపారు.‘‘వారు సెక్స్‌కు సంబంధించిన వస్తువులు విక్రయిస్తున్నారు. దీనిపై పురుషులు, స్త్రీలు కూడా ఫిర్యాదు చేశారు. కొంతమంది సోషల్ మీడియా, వాట్సాప్‌ల్లో ఈ షాపు గురించి పోస్టులు చేస్తున్నారు.


ఇది గల్లీలో ఉండటం వల్ల చాలామంది ఈ స్టోరును చూడలేదు. ఇలాంటివి మా గ్రామంలో జరిగేందుకు అంగీకరించం’’ అని దినేష్  చెప్పడం జరిగింది.ఇక దీనిపై ఈ కామకార్ట్ స్టోర్ సీఈఓ గణేషన్ ఈ విధంగా స్పందించాడు... "‘‘మేం దరఖాస్తు చేసుకున్న ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్ ఇంకా ప్రాసెస్‌లో ఉంది. అప్పటివరకు స్టోర్ ఓపెన్ చేయవచ్చని పంచాయతీ సిబ్బంది తెలిపారు. కొద్ది రోజుల్లోనే లైసెన్స్ కూడా లభించనుంది. అయితే, కొద్ది రోజులు షాప్‌ను తెరవద్దు, మూసే ఉంచాలని పంచాయతీ నుంచి సమాచారం అందింది. మేం స్థానికుల కాకపోవడం వల్ మా తీవ్రమైన ఒత్తిడి ఉంది’’ అని కామకార్ట్ సీఈవో గణేషన్ స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...



నోటికొచ్చిందల్లా రాయొద్దు .... స్వయంగా ఆయన నోటి నుండే చెప్పనివ్వండి .... ??

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>