EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-cid-case-assignments-land-amaravati-jagan-yc68ac020a-5813-43d6-851f-0ff52c69e612-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-cid-case-assignments-land-amaravati-jagan-yc68ac020a-5813-43d6-851f-0ff52c69e612-415x250-IndiaHerald.jpgఅయితే చాలామంది అనుకున్నట్లే విచారణకు హాజరుకాకూడదని చంద్రబాబు డిసైడ్ చేసుకున్నారు. అందుకనే తనకు సీఐడీ ఇఛ్చిన నోటీసును రద్దు చేయాలని, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని క్వాష్ పిటీషన్ వేశారు. పిటీషన్ను అనుమతించిన హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేస్తే నారాయణ మాత్రం వేయకుండా ఎందుకుంటారు. కాబట్టి ఈ మాజీ మంత్రి కూడా చంద్రబాబు బాటలోనే కోర్టులో పిటీషన్ వేశారు. మొత్తానికి విచారణను అడ్డుకుంటు కోర్టుల్లో కేసులు వేయటం, స్టేలు తెచ్చుకోవటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బాnaidu cid case assignments land amaravati jagan yc;cbn;amaravati;media;court;ministerహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?naidu cid case assignments land amaravati jagan yc;cbn;amaravati;media;court;ministerFri, 19 Mar 2021 03:00:00 GMTముందునుండి అందరు అనుమానిస్తున్నదే చంద్రబాబునాయుడు చేశారు. తనకు బాగా అలవాటైన విచారణను అడ్డుకునేందుకు కోర్టులో పిటీషన్ వేశారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ కోరుతు సీఐడీ చంద్రబాబుతో పాటు మాజీమంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులపై జనాల్లో భిన్నమైన వాదనలు మొదలయ్యాయి. విచారణకు హాజరవుతారని కొందరు అనుకుంటే కోర్టులో కేసు వేస్తారని ఎక్కువమంది అనుకున్నారు.




అయితే చాలామంది అనుకున్నట్లే విచారణకు హాజరుకాకూడదని చంద్రబాబు డిసైడ్ చేసుకున్నారు. అందుకనే తనకు సీఐడీ ఇఛ్చిన నోటీసును రద్దు చేయాలని, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని క్వాష్ పిటీషన్ వేశారు. పిటీషన్ను అనుమతించిన హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేస్తే నారాయణ మాత్రం వేయకుండా ఎందుకుంటారు. కాబట్టి ఈ మాజీ మంత్రి కూడా చంద్రబాబు బాటలోనే కోర్టులో పిటీషన్ వేశారు. మొత్తానికి విచారణను అడ్డుకుంటు కోర్టుల్లో కేసులు వేయటం, స్టేలు తెచ్చుకోవటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బాగా అలవాటన్న విషయం తెలిసిందే. చట్టానికి, విచారణకు తనను తాను అతీతుడనని బహుశా చంద్రబాబు అనుకుంటున్నారేమో.




పైకి చెప్పుకునేదేమో తాను నిప్పని. కానీ లోపలంతా తుప్పన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. తనపై దాఖలైన కేసుల్లో ఒక్కటంటే ఒక్క కేసులో కూడా చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయంలో విచారణను ఎదుర్కోలేదు. ఏదో ఓ పద్దతిలో విచారణను అడ్డుకుంటారు. మళ్ళీ ఒక్క కేసులో కూడా తనను ఏ కోర్టు తప్పుపట్టలేదని మీడియా ముందు ఒకటికి లక్షసార్లు చెప్పుకుంటారు. అసలు కేసులపై విచారణ జరిగితేనే కదా చంద్రబాబు నిప్పా లేకపోతే తుప్పా అని తేలేది. విచారణలో భాగంగా స్టే తెచ్చుకోవటం అందరు చేసేదే. కానీ చంద్రబాబు మాత్రం అసలు విచారణే జరగకుండా స్టే తెచ్చుకోవటమో లేకపోతే విచారణను అడ్డుకోవటంలో బాగా ఎక్స్ పర్టనే చెప్పాలి. మరి తాజా కేసులో శుక్రవారం హైకోర్టు ఏమి నిర్ణయిస్తుందో చూద్దాం.




అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>