Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chintha-chigurub62dc713-178d-4596-937c-e7ef91582293-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chintha-chigurub62dc713-178d-4596-937c-e7ef91582293-415x250-IndiaHerald.jpg పల్లెటూరులో చింత చిగురు తో అనేక రకాల వంటలు చేస్తారు. తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచిది. చింత చిగురు జూన్ మాసంలో మొదలవుతుంది. చింత చిగురు తో పప్పు తయారు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకొని తినవచ్చు. ఎలా తీసుకున్నా చింతచిగురు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... chintha chiguru;vitamin c;vitamin;heart;cholesterol;june;tamarind leaves;shaktiచింత చిగురు పులుపుగా ఉన్న.. వాటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!చింత చిగురు పులుపుగా ఉన్న.. వాటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!chintha chiguru;vitamin c;vitamin;heart;cholesterol;june;tamarind leaves;shaktiFri, 19 Mar 2021 01:00:00 GMTజూన్ మాసంలో మొదలవుతుంది. చింత చిగురు తో పప్పు తయారు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకొని తినవచ్చు. ఎలా తీసుకున్నా చింతచిగురు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 చింత చిగురు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎందుకంటే చింత చిగురు లో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్లే చెడు కొలెస్ట్రాల్ను తొలగిపోతుంది.

 గొంతులో మంట, వాపు వంటివి ఉన్నప్పుడు చింత చిగురును  ఉడికించి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కలించడం వల్ల గొంతు నొప్పి, వాపు తగ్గుతాయి. ఎందుకంటే చింత చిగురు లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

 మలబద్ధకం సమస్యను, పైల్స్ ఉన్నవారు కి చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురు లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల సుఖ  విరేచనాలు జరుగుతాయి. అలాగే మలబద్ధకం సమస్యను, ఫైల్స్ ను నివారిస్తుంది.

 చింత చిగురు వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాకుండా నోటి పూత ను కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బుల నివారణకు చింతచిగురు చాలా ఉపయోగపడుతుంది.

 చింత చిగురు తినడం వల్ల శరీరంలోని ఎర్ర  రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పోషకాలను చింత చిగురు అందిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

 చిన్న పిల్లలకు కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు చింతచిగురును తినిపించడం వల్ల నులి పురుగులు చనిపోతాయి.

 చిగురు తినడం వల్ల జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఎముకలు దృఢం గా ఉండేటట్లు చేస్తుంది.

 చింత చిగురు లో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు చింతచిగురును ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 మధుమేహం తో బాధపడేవారు చింతచిగురు తింటే రక్తంలో  చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు చింత చిగురును ముద్దగా దంచి ఇప్పుడు ఉన్న చోట పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

 చింత చిగురు తినడం వల్ల కంటి సమస్యలు కూడా దూరమవుతాయి కళ్ళు దురద గా ఉన్నప్పుడు చింత చిగురు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.


పిల్లల్ని కనడానికి ఏ వయసు సరైనదో తెలుసా..?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>