MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-incident-made-me-successful-director-says-srinu-vytla-5a924b00-f0cb-4112-bfef-7e75fbbf39b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-incident-made-me-successful-director-says-srinu-vytla-5a924b00-f0cb-4112-bfef-7e75fbbf39b3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీను వైట్ల సినిమాలని ఇష్టపడని ఆడియన్స్ ఉండరు.. కథతో పాటు ఈయన సినిమాల్లోని కామెడీని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు..వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండ్రస్టీ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు శ్రీను వైట్ల..srinu vaitla;venkatesh;badshah;manchu vishnu;naina;srinu vytla;vidya;vishnu;tollywood;industries;cinema;audience;blockbuster hit;director;hero;misterప్లాన్ మార్చిన శ్రీను వైట్ల.. ఈసారి సరికొత్తగా..??ప్లాన్ మార్చిన శ్రీను వైట్ల.. ఈసారి సరికొత్తగా..??srinu vaitla;venkatesh;badshah;manchu vishnu;naina;srinu vytla;vidya;vishnu;tollywood;industries;cinema;audience;blockbuster hit;director;hero;misterFri, 19 Mar 2021 11:49:44 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీను వైట్ల సినిమాలని ఇష్టపడని ఆడియన్స్ ఉండరు.. కథతో పాటు ఈయన సినిమాల్లోని కామెడీని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు..వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండ్రస్టీ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు శ్రీను వైట్ల..

అంతేకాదు ఒకానొక సమయంలో  శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించని హీరోయే లేడంటే అతిశయోక్తి కాదు. అందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీయే ప్రత్యక్షసాక్షి. శ్రీనుతో ఒక సినిమా అయినా చేస్తే ఓ సూపర్‌హిట్‌ సంపాదించుకోవచ్చని ప్రతీ హీరో ఆశ పడ్డ రోజుల్ని పరిశ్రమ చవిచూసింది..కానీ ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్ వంటి సినిమాలు కొంత నిరాశపరిచేసరికి ఆటోమేటిక్‌గా వైట్ల బ్రాండ్ కొంత వీక్‌ అయింది. కానీ, శ్రీను సెట్‌ చేసిన ట్రెండ్‌ మాత్రం ఫిల్మ్‌మేకింగ్‌లో ఎవర్‌గ్రీన్‌గానే ఉందిప్పటికీ కూడా. హీరోయిజాన్ని చాలా స్టయిలిష్‌గా చూపించాలన్నా, యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పరఫెక్టుగా బ్లెండ్‌ చేయాలన్నా ఆ విద్య శ్రీనుకి పట్టుబడినంతగా చాలా మంది దర్శకులకు పట్టుబడలేదు. అందుకే శ్రీను సినిమాల మూవ్‌మెంట్‌ మళ్ళీ ప్రారంభం కావాలని ఆయన అభిమానులు, పరిశ్రమలో అనేకమంది ఆతృతగా ఎదురుచూస్తునే ఉన్నారు.కాకపోతే 2018లో వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమా తర్వాత శ్రీను వైట్ల కావాలనే స్వయంగా బ్రేక్‌ తీసుకున్నారు. స్ట్రాంగ్‌ స్టోరీల మీద, ట్రీట్మెంట్‌ల మీద బాగా శ్రద్ధ చూపించి, మరింత క్రియేటివిటీతో తన బ్రాండ్‌ని మళ్ళీ రీక్రియేట్‌ చేసుకునే దిశగా శ్రీను ఛాలెంజ్‌గా తీసుకుని రాత్రింబవళ్లు కృషి చేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలతో బాక్సాఫీసులకి సమాధానం చెప్పడానికి, విమర్శకులకు ఘాటైన రిప్లై ఇవ్వడానికి శ్రీను వైట్ల సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.మంచు విష్ణుతో 'ఢీ అంటే ఢీ' అనే టైటిల్‌తో ఏప్రిల్‌లో కొత్త సినిమాలో సెట్స్‌కి వెళ్ళబోతున్నాడు శ్రీను వైట్ల. ఈ సినిమా రిజల్ట్‌ విషయంలో దర్శకుడిగా శ్రీను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు...మరి ఈ ఈ సీక్వెల్ తో నైనా శ్రీనువైట్ల హిట్ కొట్టి మళ్ళీ ఇండ్రస్టీ లో డైరెక్టర్ గా బిజీ అవుతాడేమో చూడాలి...!!


శోభన్ బాబు స్థానంలోకి రఘువరన్ అసలు సుస్వాగతం సినిమా అప్పుడు ఏమి జరిగింది?

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>