PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb479bf21-1b61-46c1-b416-44ee873d0f66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb479bf21-1b61-46c1-b416-44ee873d0f66-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో హీట్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఎక్కడా తగ్గమని టీడీపీ అంటూ వచ్చింది. ఇలా ఇరవై రెండు నెలలుగా టీడీపీ ప్రతీ దానికీ యాగీ చేస్తూ వచ్చింది. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షానికి పెద్ద దెబ్బ పడిపోయింది. ycp;jagan;andhra pradesh;mp;court;tdp;local language;ycp;mantraజైలూ...స్టేలూ. బెయిలూ...హాట్ .హాట్ పాలిటిక్స్ ?జైలూ...స్టేలూ. బెయిలూ...హాట్ .హాట్ పాలిటిక్స్ ?ycp;jagan;andhra pradesh;mp;court;tdp;local language;ycp;mantraFri, 19 Mar 2021 15:39:04 GMTఏపీ రాజకీయాల్లో హీట్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఎక్కడా తగ్గమని టీడీపీ అంటూ వచ్చింది. ఇలా ఇరవై రెండు నెలలుగా టీడీపీ ప్రతీ దానికీ యాగీ చేస్తూ వచ్చింది. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షానికి పెద్ద దెబ్బ పడిపోయింది.

వైసీపీ అటు పంచాయతీలు, ఇటు మునిసిపాలిటీ ఎన్నికల్లో పై చేయి సాధించింది. దాంతో అయినా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొన్నాళ్ళ పాటు సైలెంట్ అవుతుంది అని అంతా భావించారు కానీ ఇపుడు మళ్ళీ టీడీపీ బిగ్ సౌండ్ చేస్తోంది. దానికి కారణం వైసీపీ అనుకోవాలి. ఇలా మునిసిపల్ పోల్స్ ఫలితాలు వచ్చాయో లేవో అలా చంద్రబాబు మీద సీఐడీ కేసుని వైసీపీ సర్కార్ బనాయించేసింది. దాని మీద చంద్రబాబు కోర్టుకు వెళ్ళారు.

ఇక అక్కడ నుంచి వైసీపీ నేతలు టీడీపీ మీద విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నిప్పు అయితే ఏ తప్పూ చేయకపోతే  ఎందుకు ఆయన అలా కోర్టుకు స్టే కోసం వెళ్తారు అంటూ వైసీపీ మంత్రుల నుంచి ఇతర నేతల వరకూ గట్టిగానే మాటలు వాడారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబు నూరు స్టేలు అయినా తెచ్చుకుంటాడు తప్ప విచారణకు అసలు హాజరు కారు అంటూ సెటైర్లు వేశారు. దానికి ప్రతిగా అచ్చెన్నాయుడు గట్టిగానే కౌంటరేశారు పదేళ్ళుగా జగన్, విజయసాయిరెడ్డి మీద ఉన్న కేసుల గురించి ముందు మాట్లాడండి అంటూ తగులుకున్నారు. తొందరలో జైలుకు వెళ్తారు అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి జైలూ బెయిలూ, స్టేలతోనే ఏపీ రాజకీయాలు ఇపుడు కొత్త మలుపు తిరగడం తో వీటికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేది లేదు అంటున్నారు. జనాలకు వీటి మీద పట్టింపు పెద్దగా లేదని వరసపెట్టి జరుగుతున్న ఎన్నికలు రుజువు చేస్తున్నా ఇంకా వీటినే అటూ ఇటూ కూడా నమ్ముకోవడమే అసలైన ట్విస్ట్.






ఇండ్రస్టీకి ఆ నలుగురు హీరోలే పిల్లర్స్.. మిగతా వాళ్లంతా పక్కకెళ్లి ఆడుకోండి : శ్రీరెడ్డి

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>