PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-erra-shekerd1300c8e-ca9d-462e-842a-7d56a8d52296-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-erra-shekerd1300c8e-ca9d-462e-842a-7d56a8d52296-415x250-IndiaHerald.jpgతెలంగాణ బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టో దాదాపు సమాన స్థాయిలో సీట్లు తెచ్చుకోవడం పెద్ద అసెట్ గా మారింది. ఇంకేముంది వచ్చే ఎన్నికలలో గెలుపు జెండా ఎగర వేసేది తామే అంటూ ఒక రకంగా బిజెపి నేతలు భావిస్తూ వచ్చారు. అయితే వీళ్ల అంచనాలకు ఏమాత్రం అందకుండా తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు షాకింగ్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల అండ మాక్ ఉంటుందని కచ్చితంగా మాకే ఓటు వేస్తారని టిఆర్ఎస్ వాళ్లు ఈసారి మూటా ముల్లె సర్దుకోవడం ఖాయం అన్నారు. టీఆర్ఎస్ telangana bjp;kcr;varsha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;huzur nagar;nalgonda;mla;janareddy;ranga reddy;professor;mahbubnagarతెలంగాణ బీజేపీకి వాపుకి, బలుపుకి క్లారిటీ వచ్చేసినట్టేనా ?తెలంగాణ బీజేపీకి వాపుకి, బలుపుకి క్లారిటీ వచ్చేసినట్టేనా ?telangana bjp;kcr;varsha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;huzur nagar;nalgonda;mla;janareddy;ranga reddy;professor;mahbubnagarFri, 19 Mar 2021 13:00:00 GMTతెలంగాణ బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టో దాదాపు సమాన స్థాయిలో సీట్లు తెచ్చుకోవడం పెద్ద అసెట్ గా మారింది. ఇంకేముంది వచ్చే ఎన్నికలలో గెలుపు జెండా ఎగర వేసేది తామే అంటూ ఒక రకంగా బిజెపి నేతలు భావిస్తూ వచ్చారు. అయితే వీళ్ల అంచనాలకు ఏమాత్రం అందకుండా తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు షాకింగ్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల అండ మాక్ ఉంటుందని కచ్చితంగా మాకే ఓటు వేస్తారని టిఆర్ఎస్ వాళ్లు ఈసారి మూటా ముల్లె సర్దుకోవడం ఖాయం అన్నారు. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ నే అని గుర్తించి తమనే గెలిపిస్తారని కమలనాథులు ముందు నుంచి ప్రచారం చేసుకున్నారు. 

పీవీ కుమార్తెను కాదు కదా సీఎం కేసీఆర్ సొంత గా నిలబడినా సరే గెలిచేది మేమే అంటూ బీజేపీ నేతలు బీరాలు పలికారు. అంతేకాక పాపం ఓడిపోతున్నానంటూ పీవీ కుమార్తె మీద సానుభూతి వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీ ఏమాత్రం బలపడింది అనే అంశం ఇప్పుడు తెరమీదకు వస్తోంది. బిజెపి బలుపు ను చూసి వాపు అనుకుందని ఇతర పక్షాలు విమర్శించేలా ఈ ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బిజెపి అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఏకంగా 5వ స్థానంలో ఉన్నారు. అంటే పెద్దగా ఆశలు ఓటర్లు ఆయనని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. 

ఆ విషయం పక్కన పెడితే హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి సిట్టింగ్ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్ర రావు సైతం పరాజయం బాటలోనే ఉన్నారు ఇక్కడ పీవీ నరసింహారావు కుమార్తె సురభిని టిఆర్ఎస్ లోకి రంగంలోకి దించింది. అయితే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీకి దిగడంతో ఆయన గెలుపు ఖాయం అని భావించారు. కానీ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది, ఇక్కడఎవరు గెలిచినా బీజేపీ గెలిచే పరిస్థితి అయితే లేదు. ఇందులో ఒక్క స్థానం అయినా గెలిచి తీరుతామని భావించిన బీజేపీకి ఇది కచ్చితంగా షాక్ అనే చెప్పాలి. 

ఇక ముందు ముందు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల హడావుడి కూడా ఉంది. మొన్న 2018 ఎన్నికల్లో సైతం  ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్న సాగర్ లో ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది టీఆర్ఎస్ కు సిట్టింగ్ సీటు అందులో ఉన్న ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపు ఆయన కుటుంబ సభ్యులకు ఈ సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోనీ ఆ సీటు ఇవ్వకుండా టిఆర్ఎస్ మార్చినా కాంగ్రెస్ నుంచి సీనియర్ మోస్ట్ నేత జానారెడ్డి బరిలో ఉంటారు. దీంతో ఇక్కడ బీజేపీ గెలవడం కాదు కదా ఆయనకు ధీటైన అభ్యర్థి నిలబెట్టడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమవుతుందో.




ఏంద‌బ్బా జ‌గ‌న్ ఇదీ... రూపాయి జీతానికి రూ.ల‌క్ష‌ల్లో ప‌న్ను క‌డుతున్నావా!!!

కమల్ హాసన్ కు బిగ్ షాక్..భారీగా నగదు స్వాధీనం.. !!

వ‌కీల్‌సాబ్ ప్ర‌మోష‌న్ కోసం వామ్మో..! అంత ఖ‌ర్చు చేస్తున్నారంట‌...‌

సోము వీర్రాజు విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారా...?

ఫ్యాన్స్ ని పిలవాలా వద్దా..? పవన్ సంశయం..

చంద్రబాబు, జగన్ కామన్ గా ఇబ్బంది పడే పాయింట్ ఇదే...!

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>