Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan72475e0f-c7d8-41b3-ad02-96370dc512f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan72475e0f-c7d8-41b3-ad02-96370dc512f9-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. కానీ ఒకరకంగా పడకేసిందని చెప్పాలి. అయితే నిన్న మొన్న ప్రారంభమైన వీరమల్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డల్ అయిపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మొత్తానికి ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ స్పీడ్ ను పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.. pawan kalyan;pawan;dil raju;kalyan;pawan kalyan;tollywood;cinema;media;producer;king;event;remake;producer1;dilఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ వస్తాడా...?ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ వస్తాడా...?pawan kalyan;pawan;dil raju;kalyan;pawan kalyan;tollywood;cinema;media;producer;king;event;remake;producer1;dilFri, 19 Mar 2021 03:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. కానీ ఒకరకంగా పడకేసిందని చెప్పాలి. అయితే నిన్న మొన్న ప్రారంభమైన వీరమల్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంటే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డల్ అయిపోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మొత్తానికి ఈ విషయాన్ని గుర్తించిన నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ స్పీడ్ ను పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గురించి మరింత  తెలుసుకుందాం..


అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన సాంగ్ రిలీజ్‌, సోష‌ల్ మీడియా అప్డేట్లు స‌రిపోవు. ఇంకా ఏదైనా భారీగా జ‌ర‌గాలి. అలా జ‌ర‌గాలంటే  ప‌వ‌ర్ స్టార్ పాల్గొనాల్సిందే. కానీ  ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్లో పాల్గొన‌డు అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఏం చేయాలి అన్న‌ప్పుడు క‌నిపిస్తున్న ఏకైక ఆప్ష‌న్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌. అయితే  ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి, ఓ పూట‌ టైం అడిగితే.ప‌వ‌న్‌ వ‌చ్చి వెళ్లే అవ‌కాశం ఉంది. కానీ  అది కూడా అంత ఈజీగా లేదు. దీనికి కార‌ణం ప‌వ‌న్ టైట్ షెడ్యూలే. ఇప్పుడు ఏక‌ధాటి రెండు షూటింగుల్లో పాల్గొంటున్నాడు ప‌వ‌ర్ స్టార్‌. ఉద‌యం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, మ‌ధ్యాహ్నం ఏకే రీమేక్ సెట్లో ఉంటున్నాడు.



ఇక‌, సాయంత్రం పొలిటిక‌ల్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ, అందుకు త‌గిన‌ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాడు.ఇంత‌టి బిజీ షెడ్యూల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ప‌వ‌న్ వ‌స్తాడా? అన్న‌ది సందేహంగా మారింది. మ‌రోవైపు  ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి గోల మొద‌లైంది. రీఎంట్రీ సినిమాకు సంబంధించిన ప్ర‌చారం లైట్ గా ఉందంటూ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ను ఖ‌చ్చితంగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు తీసుకురావాల్సిన భారం దిల్ రాజుపై ప‌డింది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? ఎప్పుడు ఫంక్ష‌న్ చేస్తారు? అస‌లు ప‌వ‌న్ వ‌స్తాడా? రాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>