MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/flipkart-binni-bansal--sachin-bansal5f19f305-651a-431c-92de-633f758d4cb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/flipkart-binni-bansal--sachin-bansal5f19f305-651a-431c-92de-633f758d4cb8-415x250-IndiaHerald.jpgబిన్నీ బన్సాల్ , సచిన్ బన్సాల్ .. వీరిద్దరి పేర్లు పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వీరు పెట్టిన ఈ - కామర్స్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ అన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. వీరు ఎవరో కాదు ఫ్లిప్ కార్ట్ సంస్థ ఆవిష్కర్తలు.. " ఏం చేయకుండా ఉండడం కంటే నచ్చింది చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు" అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఈనాటి యువతకు ప్రతినిధులు.. పెద్దగా పెట్టుబడి లేకపోయినప్పటికీ, స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్ లు పెట్టి, విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్ అంబాసిడర్ లు.. " చేసే పని ఏదోflipkart ,binni bansal , sachin bansal;technology;sachin;tara;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;amazon;capital;bengaluru 1;customer;chandigarh;flipkartమనీ : నాడు కేవలం రూ.2 లక్షలతో ఫ్లిప్ కార్ట్ ను ఆరంభించి, నేడు రూ.1.4 లక్షల కోట్లకు పైగా సంపాదిస్తున్నారు..!మనీ : నాడు కేవలం రూ.2 లక్షలతో ఫ్లిప్ కార్ట్ ను ఆరంభించి, నేడు రూ.1.4 లక్షల కోట్లకు పైగా సంపాదిస్తున్నారు..!flipkart ,binni bansal , sachin bansal;technology;sachin;tara;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;amazon;capital;bengaluru 1;customer;chandigarh;flipkartFri, 19 Mar 2021 11:00:00 GMTబిన్నీ బన్సాల్  ,  సచిన్ బన్సాల్ .. వీరిద్దరి పేర్లు పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వీరు పెట్టిన ఈ - కామర్స్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ అన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. వీరు ఎవరో కాదు ఫ్లిప్ కార్ట్ సంస్థ ఆవిష్కర్తలు.. " ఏం చేయకుండా ఉండడం కంటే నచ్చింది చేసి ఫెయిల్ అయినా పర్వాలేదు"  అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఈనాటి యువతకు ప్రతినిధులు.. పెద్దగా పెట్టుబడి లేకపోయినప్పటికీ,  స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్ లు పెట్టి, విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్ అంబాసిడర్ లు.. " చేసే పని ఏదో సీరియస్ గా చేయాలి అని గట్టిగా నమ్ముతారు. అందులో భాగంగానే వీరికి బాగా కలిసొచ్చింది  ఏమిటంటే రోజురోజుకు మారిపోతున్న టెక్నాలజీ. దాని కారణంగా వీరు విస్తృత విభాగాలను సరికొత్త సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోగలిగారు.


వారి జీవితాన్ని మాత్రమే మార్చుకోవడమే కాకుండా భారత ముఖచిత్రాన్ని కూడా మార్చారు.. అయితే ఫ్లిప్ కార్ట్  సంస్థకు కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అగ్రిగేటర్ లను స్థాపించారు. అగ్రిగేటర్ లు అంటే. అవసరం తీర్చే వారిని అవసరం ఉన్న వారిని కలిపే మధ్యవర్తులు అన్నమాట.. అంటే కొనుగోలుదారులకు ఎలాంటి  బాదరబందీ లేకుండా విక్రయదారులు నుండి నేరుగా కొనుగోలుదారులకు చేరవేసే లాగా మధ్యవర్తులుగా ఈ ఫ్లిప్ కార్ట్ సంస్థ వారు అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టించారు. వీరికి ఎటువంటి సొంత ఉత్పత్తులు కానీ తయారీ కేంద్రాలు కానీ  ఉండవు. ఉన్నదంతా టెక్నాలజీ మాత్రమే..



సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఊరు, పేరు కలిసినప్పటికీ, వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. చండీగఢ్ లో పుట్టి, ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐ ఐ టీ ఢిల్లీ లో కలిశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ రాజధాని అయిన బెంగళూరులో కలిశారు. సచిన్ మాత్రం అమెజాన్ లో చేరాడు.  కానీ బిన్నీ బన్సల్ గూగుల్లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి,  ఫెయిల్ అయ్యాడు. ఇక చివరకు తాను కూడా చేసేదేమీ లేక అమెజాన్ లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఆ కంపెనీలో ఉన్న మెలుకువలను అన్నీ తెలుసుకొని, ఇద్దరూ కలసి ఒకటే అనుకున్నారు . తాము పనిచేస్తున్న అమెజాన్ స్థాయిలో దేశీ ఈ - కామర్స్ కంపెనీలు ఏవీ సేవలు అందించడం లేదు. అంతే.. సేవింగ్స్ గా దాచుకున్న రెండు లక్షల రూపాయలు పెట్టి,  తమ ఫ్లాట్లోనే 2007లో ఫ్లిప్ కార్ట్ ను ఆరంభించారు.


అయితే వీరిరువురికీ వారి తల్లిదండ్రులు నెలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చి ప్రోత్సహించారు. మొదటగా పుస్తకాలు విక్రయించే వారిని లిఫ్ట్ చేసి, అమెజాన్ మాదిరే ఆరంభంలో వారు కూడా ఆన్లైన్లో పుస్తకాలను విక్రయించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు వారి తల్లిదండ్రులు  పది వేల రూపాయల చొప్పున ఇరువురికి ఆదుకున్నారు. తర్వాత పుస్తకాల నుంచి వస్తువులు అమ్మే సెల్లర్లను తమ సైట్లో లిస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అమెజాన్ కు పోటీగా దేశీ ఈ-కామర్స్ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్న సమయంలో.. ఈ విషయాన్ని తెలుసుకుని  విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఒక వరుసగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించారు.. ఇక వీరికి కాలం కలిసి వచ్చింది. ఇద్దరు బిలియనీర్లు అయ్యారు.. ఇక ఈ మధ్యనే ఫ్లిప్ కార్ట్ ను రూ.1.4 లక్షల కోట్ల విలువ తో అమెరికన్ దిగ్గజం వాల్మార్ట్ సొంతం చేసుకుంది..





ప్లాన్ మార్చిన శ్రీను వైట్ల.. ఈసారి సరికొత్తగా..??

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>