MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5d7de606-86e1-423b-aa4c-822e3a2782f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5d7de606-86e1-423b-aa4c-822e3a2782f5-415x250-IndiaHerald.jpgదర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ మూవీ ద్వారా మెగాఫోన్ పట్టారు. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పక్కాగా కమర్షియల్ అంశాలు జోడించి ప్రేక్షకులని మెప్పించడంలో ఎంతో సఫలమైన అనిల్ రావిపూడి ఓవరాల్ గా ఈ మూవీతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నారు. anil-ravipudi;mahesh-babu;mahesh;ntr;ravi;venkatesh;shruti;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;rashmika mandanna;ravi teja;sai dharam tej;sruthi;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;media;f2;heroine;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;gmb entertainments;sri venkateshwara creations;raja the great;dil;f3;pattas;ntr artsప్చ్ .... మిగతా అన్ని విషయాల్లో ఓకె ... కానీ అందులో మాత్రం వీకె ....??ప్చ్ .... మిగతా అన్ని విషయాల్లో ఓకె ... కానీ అందులో మాత్రం వీకె ....??anil-ravipudi;mahesh-babu;mahesh;ntr;ravi;venkatesh;shruti;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;rashmika mandanna;ravi teja;sai dharam tej;sruthi;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;media;f2;heroine;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;gmb entertainments;sri venkateshwara creations;raja the great;dil;f3;pattas;ntr artsFri, 19 Mar 2021 17:00:00 GMTఅనిల్ రావిపూడి తొలిసారిగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ మూవీ ద్వారా మెగాఫోన్ పట్టారు. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పక్కాగా కమర్షియల్ అంశాలు జోడించి ప్రేక్షకులని మెప్పించడంలో ఎంతో సఫలమైన అనిల్ రావిపూడి ఓవరాల్ గా ఈ మూవీతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నారు.

అనంతరం సాయి ధరమ్ తేజ్ హీరోగా తీసిన సుప్రీం, ఆపై రవితేజ తో తెరకెక్కించిన రాజా ది గ్రేట్, అనంతరం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్2 సినిమాలు కూడా వరుసగా విజయాలు అందుకుని అనిల్ రావిపూడి కి సూపర్ హిట్స్ అందించాయి. ఇక గత ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సరిలేరు నీకెవ్వరు వంటి పక్కా కమర్షియల్ మూవీ ని తెరకెక్కించి దానితో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి కెరీర్ పరంగా అపజయమెరుగని దర్శకుడిగా ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎఫ్2 కి సీక్వెల్ గా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ, వరుణ్ లతో ఎఫ్3 మూవీ తీస్తున్న అనిల్ రావిపూడి దానిని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే దీని తర్వాత మరొక సారి సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ రావిపూడి పనిచేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయని, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రయోగాత్మక మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. నిజానికి మొదటి నుంచి అనిల్ రావిపూడి తీసిన సినిమాలు పరిశీలిస్తే ఆయన సినిమాల్లో అన్ని అంశాలు ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ సాంగ్స్ విషయంలో మాత్రం ఆయన సరైన శ్రద్ధ పెట్టటం లేదనేది కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా గతేడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని కావున తదుపరి మహేష్ తో తీయబోయే సినిమా సాంగ్స్ విషయంలో ఆయన పక్కాగా జాగ్రత్త వహించాలని పలువురు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనిల్ ని విజ్ఞప్తి చేస్తున్నారు...... !!


8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>