PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt6ea08b35-ce12-4e4a-b40e-97ba3f662932-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt6ea08b35-ce12-4e4a-b40e-97ba3f662932-415x250-IndiaHerald.jpgవైసీపీ ఇపుడు ఏపీలో గెలిచే పార్టీ. ఈ ఎన్నికలు జరిగినా గెలుపే అంటూ జబ్బలు చరుస్తోంది. ఫలితాలను కూడా అందుకు ధీటుగా రాబట్టుకుంటోంది. అటువంటి వైసీపీ ఇపుడు తెగ టెన్షన్ పడుతోందిట. అది కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక గురించిట. ఇది నిజమేనా అంటే వైసీపీ క్యాంప్ లో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారన్నది వాస్తవం అంటున్నారు. tpt;lakshmi;tiru;peddireddy ramachandra reddy;tirupati;panchayati;minister;husband;tdp;local language;ycp;party;panabaka lakshmiవైసీపీకి తిరుపతి టెన్షన్...?వైసీపీకి తిరుపతి టెన్షన్...?tpt;lakshmi;tiru;peddireddy ramachandra reddy;tirupati;panchayati;minister;husband;tdp;local language;ycp;party;panabaka lakshmiFri, 19 Mar 2021 15:25:32 GMTవైసీపీ ఇపుడు ఏపీలో గెలిచే పార్టీ. ఈ ఎన్నికలు జరిగినా గెలుపే అంటూ జబ్బలు చరుస్తోంది. ఫలితాలను కూడా అందుకు ధీటుగా రాబట్టుకుంటోంది. అటువంటి వైసీపీ ఇపుడు తెగ  టెన్షన్ పడుతోందిట. అది కూడా తిరుపతి లోక్ సభ  ఉప ఎన్నిక గురించిట. ఇది నిజమేనా అంటే వైసీపీ క్యాంప్ లో  మాత్రం  మల్లగుల్లాలు పడుతున్నారన్నది వాస్తవం అంటున్నారు.

తాజగా జరిగిన స్థానిక ఎన్నికల్లో  చిత్తూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి టీడీపీ కి ఉనికి లేకుండా చేసిన వైసీపీకి ఎందుకంత టెన్షన్ అంటే అది గెలుపు గురించి అసలు కాదుట. ఇపుడు కొత్త టెన్షన్ వచ్చిపడింది అంటా మెజారిటీ కోసమేనట. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన బల్లి దుర్గా ప్ర‌సాద్ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి మీద  2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇపుడు రెండేళ్ళూ అయినా వైసీపీ మీద మోజు తగ్గలేదు అని పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికలు రుజువు చేశాయి. మరో వైపు ఉప ఎన్నిక ప్రకటన రాగానే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తాము మూడు లక్షలకు తక్కువ కాకుండా గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఇక మొత్తం పోల్ అయిన ఓట్లలో ఎనభై శాతానికి పైగా వైసీపీకే పడాలని వైసీపీ హై కమాండ్ ఆశగా ఉంది. మరి ఇన్ని రకాలుగా టార్గెట్లు ఉన్న నేపధ్యంలోనే ఇపుడు వైసీపీలో యమ టెన్షన్ గా ఉందిట. ఏ మాత్రం మెజారిటీ తగ్గినా కూడా అదే విపక్షాలకు అయుధం అవుతుంది అని భయపడుతున్నారుట. విపక్షాలు కచ్చితంగా వైసీపీ మెజారిటీని వీలు అయినంతవరకూ తగ్గించేదాని మీదనే గురి పెట్టారని వార్తలు వస్తున్న నేపధ్యంలో వైసీపీకి ఈ విషయంలోనే చమటలు పడుతున్నాయి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. జనాలు ఎలా రియాక్ట్ అవుతారో.




 


8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>