Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye73d87c0d-4fa3-45be-8ed1-316507632e81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye73d87c0d-4fa3-45be-8ed1-316507632e81-415x250-IndiaHerald.jpgబొప్పాయి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు రోగనిరోధకశక్తిని పెంపొందించడంతో పాటు చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందించేందుకు బొప్పాయి ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు ఒక బొప్పాయి స్లైస్ ను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయిని రోజు వారి డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటboppaye;bhavana;tara;dry fruits;iron;vitamin;copper;aquaబొప్పాయితో ఆశ్చర్యపరిచే ఆరోగ్యప్రయోజనాలు..?బొప్పాయితో ఆశ్చర్యపరిచే ఆరోగ్యప్రయోజనాలు..?boppaye;bhavana;tara;dry fruits;iron;vitamin;copper;aquaFri, 19 Mar 2021 06:00:00 GMTఫ్రూట్ లో ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి.బొప్పాయిని ఇంగ్లీషులో ‘ఫ్రూట్ ఆఫ్ యాంజిల్స్’ అంటారు. అంటే దేవదూతల ఫలమని అర్థం. ఈ పండులో శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయట. ఈ పండులో ఉన్న మరిన్ని ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా!

బొప్పాయి పండులో పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి.బొప్పాయిలో అధిక పీచుపదార్థాలు, తక్కువ కేలోరీలు ఉంటాయి. కాబట్టి, ఇది తింటే సులభంగా బరువు తగ్గుతారు.బొప్పాయి ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో అతిగా తినలేం. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-C, విటమిన్-K అధిక మోతాదులో ఉంటాయి.జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి చాలా మంచిది.బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.మలబద్దకాన్ని నివారించేందుకు బొప్పాయి మంచి ఔషదంలా పనిచేస్తుంది.బొప్పాయిలో అల్సర్లను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.ఈ పండులో ఉండే పపైన్, కిమోపపైన్ ఎంజైమ్‌లు కడుపులో మంటను తగ్గిస్తాయి.


కిమోపపైన్, పపైన్ ఎంజైమ్‌ల వల్ల గాయాలు త్వరగా మానతాయి.రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే విటమిన్-A, విటమిన్-C బొప్పాయిలో ఉంటాయి. జలుబు, జ్వరాలు రాకుండా బొప్పాయి నివారిస్తుంది. రోజూ బొప్పాయి తినడం కంటి చూపుకు కూడా మంచిది.ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్స్ వల్ల పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యానర్లు వచ్చే ముప్పు తగ్గుతుంది.


చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో ఉత్తమం. దీన్ని చర్మానికి రాసుకుంటే.. పపైన్ అనే ఎంజైమ్ వల్ల శరీరం కాంతివంతం అవుతుంది.బొప్పాయితో మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మంపై ముడతల నివారణిగా ఈ పండు పనిచేస్తుంది. బొప్పాయిలోని ల్యూటిన్, జియాక్సాన్‌థిన్, క్రిప్టాక్సాన్‌థిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి.ఫ్రీ రాడికల్స్ వల్ల త్వరగా వయసు మీద బడటంతోపాటు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి బొప్పాయి తినడం మంచిదే.


హోలీ పండుగకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా...?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>