Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jofra-archer-2018-tweet-going-viral-after-his-bat-broke-in-4th-t20-against-indiabbfc1975-cc46-4a99-b3dc-5ba532de0210-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jofra-archer-2018-tweet-going-viral-after-his-bat-broke-in-4th-t20-against-indiabbfc1975-cc46-4a99-b3dc-5ba532de0210-415x250-IndiaHerald.jpgటీమిండియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్యాట్ విరిగిపోయింది. బంతిని బలంగా బాదే సమయంలో బ్యాట్ ఎడ్జ్ ముక్క విరిగింది. అయితే ఇలా బ్యాట్ విరిగిపోతుందని ఆర్చర్‌కు ముందే తెలుసట. ప్రస్తుతం నెటిజన్లు అదే విషయాన్ని చెబుతున్నారు. దీనికి రుజువుగా మూడేళ్ల క్రితం ఆర్చర్ చేసిన..t20i;rohit;rohit sharma;american samoa;twitter;nijam;paruguబ్యాట్ విరుగుతుందని 3ఏళ్ల క్రితమే కనిపెట్టిన ఆర్చర్.. ట్వీట్ వైరల్బ్యాట్ విరుగుతుందని 3ఏళ్ల క్రితమే కనిపెట్టిన ఆర్చర్.. ట్వీట్ వైరల్t20i;rohit;rohit sharma;american samoa;twitter;nijam;paruguFri, 19 Mar 2021 21:41:19 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్యాట్ విరిగిపోయింది. బంతిని బలంగా బాదే సమయంలో బ్యాట్ ఎడ్జ్ ముక్క విరిగింది. అయితే ఇలా బ్యాట్ విరిగిపోతుందని ఆర్చర్‌కు ముందే తెలుసట. ప్రస్తుతం నెటిజన్లు అదే విషయాన్ని చెబుతున్నారు. దీనికి రుజువుగా మూడేళ్ల క్రితం ఆర్చర్ చేసిన ఓ ట్వీట్‌ను చూపిస్తున్నారు. ఈ ట్వీట్ చూస్తే నిజంగా ఆర్చర్‌కు తన బ్యాట్ విరిగిపోతుందని ముందే తెలుసేమో అని మనకు కూడా అనిపించకమానదు.

జోఫ్రా ఆర్చర్ చేసే ట్వీట్లు ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలను ఆర్చర్ ఎప్పుడో చెప్పేశాడని, అతడో సోర్సరర్(భవిష్యత్తు చూడగల వ్యక్తి) అంటూ నెటిజన్లు ఆర్చర్‌ను ప్రశంసిస్తుంటారు. అతడు చేసిన ట్వీట్లను ఉదాహరణలుగా చూపిస్తుంటారు. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటతీరు నుంచి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుపు వరకు జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో చేసిన ట్వీట్ల ప్రకారమే జరగడాన్ని కూడా ప్రూఫ్‌గా చూపిస్తుంటారు. తాజాగా ఇండియాతో జరిగిన టీ20లో అతడి బ్యాట్ విరగడంపై కూడా 2018లోనే ఆర్చర్ గుర్తించాడట. అందుకే ‘ఇంగ్లండ్‌లో బ్యాట్‌‌లు బాగుచేసే వారు ఎవరైనా ఉంటే చెప్పండి’ అంటూ అప్పట్లో ఆర్చర్ ఓ ట్వీట్ చేశాడట. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఆర్చర్‌కు ఇప్పటివరకు బ్యాట్‌లు రిపేర్ చేసే వ్యక్తి ఎవరూ దొరకలేదన్నమాట.

ఇదిలా ఉంటే చివరి ఓవర్ వరకు సాగిన టీమిండియా-ఇంగ్లండ్ నాలుగో టీ20లో ఆఖరి ఓవర్లో భారత శిబిరంలో ఆర్చర్ టెన్షన్ పుట్టించాడు. 20వ ఓవర్లో 23 పరుగులు రావల్సి ఉండగా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆర్చర్ ఏకంగా ఓ బౌండరీ, ఓ సిక్సర్ బాదేశాడు. దీంతో టీమిండియా డగౌట్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ముఖమైతే ఒక్కసారిగా మారిపోయింది. దీంతో చివరి 3 బంతుల్లో ఇంగ్లండ్ 12 పరుగులు చేస్తే చాలు. అలాంటి పరిస్థితుల్లో శార్దూల్ వరుసగా రెండు వైడ్స్ వేశాడు.

ఇక 3 బంతుల్లో కావలసింది 10 పరుగులే. ఇక విజయం చేజారినట్లేనా అనే అనుమానం భారత ప్రేక్షకుల్లో కలిగింది. అయితే తరువాతి బంతిని కూడా శార్దూల్ వైడ్ క్రీజ్‌కు దగ్గరగా వేయడంతో ఆ బంతిని ఆర్చర్ భారీ షాట్ ఆడాడు. కానీ దుదృష్టవశాత్తూ అదే సమయంలో బ్యాట్ విరిగిపోయింది. దీంతో బంతిని బలంగా బాదలేకపోయాడు. సింగిల్ తీసి జోర్డాన్‌కు స్ట్రైక్ ఇవ్వడం, అతడు అవుట్ కావడం, తర్వాతి బంతికి పరుగులేమీ రాకపోవడంతో టీమిండియా విజయం సాధించింది.
">

" style="height: 369px;">





రోజు పెసర మొలకలు తింటున్నారా... అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>