LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/zero2ecf4328-6167-41de-9ead-86ed43b451af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/zero2ecf4328-6167-41de-9ead-86ed43b451af-415x250-IndiaHerald.jpgసున్నా.. ఈ పదాన్ని మనం పనికిమాలిన అనే అర్థంలో ఎక్కువగా వాడుతుంటాం..కానీ సున్నా చాలా విలువైంది. దీనిపై ములుగు విశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం చదివితే దాని విలువేంటో మనకు బోధపడుతుంది. “ 0 కి విలువెంత అని పంతుల్ని అడిగితే సున్నా కి విలువేంటి? శూన్యం అంటాడు! 0 లేకుండా పంతులూ లేడు! ఏ పండితుడూ లేడు! అంకెల దరిజేరి అది విలువలను పెంచు! పదముల దరిజేరి పదార్థములనే కూర్చు! సున్న ప్రక్కన 0 చేరి సున్నం అయ్యె! అన్న ప్రక్కన 0 చేరి అన్నం అయ్యె! ఆంధ్రా లో అన్నబియ్యం కూడా కిలో రెండు అయ్యె! పది మధ్zero;shiva;govi;jeevitha rajaseskhar;mahima;satya;tiru;vishwa;korcha;kanna lakshminarayana;panchayati;temple;lord siva;paruguసున్నా గురించి తెలుసుకుంటే.. నోరు వెళ్లబెట్టాల్సిందే..!?సున్నా గురించి తెలుసుకుంటే.. నోరు వెళ్లబెట్టాల్సిందే..!?zero;shiva;govi;jeevitha rajaseskhar;mahima;satya;tiru;vishwa;korcha;kanna lakshminarayana;panchayati;temple;lord siva;paruguFri, 19 Mar 2021 11:00:00 GMTవిశ్వ నాధ శాస్త్రి గారి కవితా విన్యాసం చదివితే దాని విలువేంటో మనకు బోధపడుతుంది.

“ 0 కి విలువెంత అని పంతుల్ని అడిగితే
సున్నా కి విలువేంటి? శూన్యం అంటాడు!

0 లేకుండా
పంతులూ లేడు! ఏ పండితుడూ లేడు!

అంకెల దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!

సున్న ప్రక్కన 0 చేరి సున్నం అయ్యె!
అన్న ప్రక్కన 0 చేరి అన్నం అయ్యె!  
ఆంధ్రా లో అన్నబియ్యం కూడా కిలో రెండు అయ్యె!

పది మధ్యలో దూరి పంది గా మారె!
నది మధ్యలో దూకి  నంది గా మారె!

ప్రతి కొంప లోనూ  అది తిష్ట వేసింది!
0 లేనట్టి సంసారమే లేదు!

కాంగి లోనూ దూరె! దేశం లోనూ దూరె!
కమలం లోనూ దూరే ! అది రాజకీయం కూడా నడుపుచుండె!
పంచాయతీ నుండి పార్లమెంటు వరకూ అది మెంబరై ఉండ!

గుండుసున్నా అని ఎగతాళి చేయకు
గూండా గా మారి రుబాబు చేయు!

ఆరంభము న 0!  అంత మందున 0!
జననం లో 0!
మరణం లో 0!
శూన్యం లో 0!  అనంతము లో 0!

ఇందూ, అందూ అను సందేహమేల!
అండ, పిండ, బ్రహ్మాండము లలో 0!  

సత్యం, శివం, సుందరం
అన్నింటిలోనూ అది అలరారుతోంది!

0 తోటే ఉంది అందం!  ఆనందం!
జీవితం లో  చివరకి మిగిలేది 0 !

గోవిందా! ముకుందా! శంభో! శంకరా!
సున్నాలు గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
ఏడుకొండల వాడా! వెంకట రమణా!
నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా!

తిరుపతిలో ఎక్కు ప్రతి కొండ లోనూ 0!
తిరిగి దిగి వచ్చు ప్రతి గుండు లోనూ 0!

ఇంత మహిమ గల 0 -మరి గుడి లోను లేదని, బడి లోను లేదని
దిగులెందుకన్నా! గుడి లోన జేరి గుండి గా,
బడి లోన జేరి బండి గా మారడం దాని అభిమతం కానే కాదన్నా!
 
కనుక గుడి  గంట లో చేరి, బడి గంట లోనూ చేరి
మోత మోగిస్తోందన్నా! ఆ మోత నాదం లోనూ 0!

కాలం తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి పక్షం, ప్రతి మాసం,
ప్రతి సంవత్సరం, అన్నిటా ఉండి కాలచక్రo ను అది తిప్పుతోంది!

వారం, వర్జ్యం అంటూ, గ్రహం - గ్రహణం అంటూ
పంచాంగం అంతా సున్నా ల మయమే!

రోగం లో 0 ! దానికి చేసే వైద్యం లో 0!
అంగాంగము న 0 అంటిపెట్టుకుని ఉండ
దేహం తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా భస్మం చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది గంతు లేస్తోంది!

"జైహో సున్నా... జయ జయహోసున్నా"


శోభన్ బాబు స్థానంలోకి రఘువరన్ అసలు సుస్వాగతం సినిమా అప్పుడు ఏమి జరిగింది?

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>