PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-central-latest-breaking0029221d-02ee-475d-a3ec-c933b428a6c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-modi-central-latest-breaking0029221d-02ee-475d-a3ec-c933b428a6c3-415x250-IndiaHerald.jpgదేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను, వాటికి చెందిన విలువైన భూముల‌ను ప్ర‌యివేటుప‌రం చేయ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే మోడీ స‌ర్కారు పావులు క‌దుపుతోంది. భారీ న‌ష్టాల్లో ఉన్నాయ‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు గుదిబండ‌లా మారాయ‌ని చెపుతూ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు త‌లుపులు బార్లా తెరిచింది. బ‌ల‌మైన యంత్రాంగం ఉన్న ప్ర‌భుత్వాలే ఈ సంస్థ‌ల‌ను న‌డ‌ప‌లేని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు ప్ర‌యివేటు వ్య‌క్తులు వాటిని ఎలా న‌డ‌ప‌గ‌లుగుతారు? అంటే ప్ర‌భుత్వాలే కావాల‌ని విలువైన సంస్థ‌ల‌ను త‌మ అస్మ‌దీయ కార్పొరేట్ల‌కు క‌ట్టబెటbjp, modi, central, latest, breaking;modi;tara;telugu desam party;telangana;telugu;vishakapatnam;partyవిశాఖ ఉక్కు... అదానీ హ‌క్కువిశాఖ ఉక్కు... అదానీ హ‌క్కుbjp, modi, central, latest, breaking;modi;tara;telugu desam party;telangana;telugu;vishakapatnam;partyThu, 18 Mar 2021 10:15:31 GMTమోడీ స‌ర్కారు పావులు క‌దుపుతోంది. భారీ న‌ష్టాల్లో ఉన్నాయ‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు గుదిబండ‌లా మారాయ‌ని చెపుతూ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు త‌లుపులు బార్లా తెరిచింది. బ‌ల‌మైన యంత్రాంగం ఉన్న ప్ర‌భుత్వాలే ఈ సంస్థ‌ల‌ను న‌డ‌ప‌లేని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు ప్ర‌యివేటు వ్య‌క్తులు వాటిని ఎలా న‌డ‌ప‌గ‌లుగుతారు? అంటే ప్ర‌భుత్వాలే కావాల‌ని విలువైన సంస్థ‌ల‌ను త‌మ అస్మ‌దీయ కార్పొరేట్ల‌కు క‌ట్టబెట్టే ప్ర‌య‌త్న‌మంటూ ఉద్య‌మకారులు మండిప‌డుతున్నారు.

ఏపీలో ఎవ‌రూ నోరెత్త‌రు అన్న ధైర్యం
ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకున్న మోడీ స‌ర్కారు అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీకి కేసుల భ‌యం ఉంది కాబ‌ట్టి వారెవ‌రూ నోరెత్త‌రు... ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మ‌న‌తో పొత్తు కోసం, అధికారం కోసం త‌హ‌త‌హ‌లాడుతోంది కాబ‌ట్టి ఏమీ మాట్లాడ‌దు.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్నారు... కాబ‌ట్టి ఎవ‌రూ ప్ర‌శ్నించే ధైర్యం చేయ‌రు... ఇక్క‌డి ప్ర‌జ‌లు అస‌లు మాట్లాడ‌రు.. వారికేం ప‌ట్ట‌దు.. అని ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కూడా అంచ‌నా వేసుకున్నారు. వెంట‌నే విశాఖ ఉక్కును ప్ర‌యివేటు ప‌రం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వంద‌కు వందశాత‌మ‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌ల చేసిన ప్ర‌క‌ట‌న అగ్నికి ఆజ్యం పోసిన‌ట్ల‌యింది.

కంపెనీ చేజిక్కించుకుంటే వ‌చ్చే ఇబ్బందులేంటి?
ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఉద్య‌మబాట ప‌ట్టాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ నుంచి విశాఖ ఉక్కుకు మ‌ద్ద‌తు ల‌భించింది. ఉద్య‌మం ఉధృత‌మ‌వుతున్న త‌రుణంలో అదానీ గ్రూప్‌న‌కు చెందిన అధికారులు విశాఖ‌ప‌ట్నం వ‌చ్చారు. విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారాన్ని అదానీ గ్రూప్ ద‌క్కించుకోబోతున్న‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి. విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న ఉక్కు ఉద్య‌మాన్ని అంచ‌నా వేసేందుకే వారు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ ప‌రిస్థితి ఏమిటి?  శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి ఏంటి? ఉద్య‌మం ఎలా న‌డుస్తోంది? క‌ర్మాగారాన్ని కొనుగోలుచేస్తే వ‌చ్చే ఇబ్బందులు ఏంటి? త‌దిత‌ర విష‌యాల‌ను ఆక‌ళింపు చేసుకోవ‌డానికి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ కొద్దిరోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.


కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>