PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-ambani-adani-latest-breaking13459870-4132-4bfd-a5f1-b48a6995b717-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-ambani-adani-latest-breaking13459870-4132-4bfd-a5f1-b48a6995b717-415x250-IndiaHerald.jpgభార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న జాతీయ ప్ర‌జాస్వామ్య కూట‌మి (ఎన్డీయే) ప్ర‌భుత్వం మొద‌టిద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధి, కార్మికులు, ఉద్యోగుల శ్రేయ‌స్సు అంటూ పాల‌కులు చాలా పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడారు. నిజ‌మే కాబోలు అనుకున్నారు అమాయ‌క ప్ర‌జ‌లు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే ర‌స‌వ‌త్త‌ర నాట‌కానికి మోడీ స‌ర్కార్ తెర‌తీసింది. ముందునుంచి తాను ఏంచేయాల‌ని ఒక ప్ర‌ణాళిక ర‌చించుకుందో దాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించింది. modi, ambani, adani, latest, breaking;view;modi;mukesh;india;vishakapatnam;central government;corporateఉత్త‌రాది అంబానీకి.. ద‌క్షిణాది అదానీకిఉత్త‌రాది అంబానీకి.. ద‌క్షిణాది అదానీకిmodi, ambani, adani, latest, breaking;view;modi;mukesh;india;vishakapatnam;central government;corporateThu, 18 Mar 2021 07:34:26 GMTమోడీ స‌ర్కార్ తెర‌తీసింది. ముందునుంచి తాను ఏంచేయాల‌ని ఒక ప్ర‌ణాళిక ర‌చించుకుందో దాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించింది.  ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌న్నింటినీ ప్ర‌యివేటుప‌రం చేస్తున్నామంటూ అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టేస్తోంది.

న‌ష్టాల్లో ఉన్నాయ‌నే సాకులు
రెండోద‌ఫా అధికారం చేప‌ట్టిన మోడీ స‌ర్కార్ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటుప‌రం చేయ‌డం ప్రారంభించింది. న‌ష్టాల్లో ఉన్నాయ‌ని, వాటిని న‌డ‌ప‌డంవ‌ల్ల ప్ర‌భుత్వానికి భార‌మేకానీ ఎటువంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.బీఎస్ఎన్ఎల్‌, విశాఖ ఉక్కు క‌ర్మాగారం, త‌ర్వాత బీహెచ్ఈఎల్‌, కోల్ ఇండియా... ఇలా అన్నింటినీ ప్ర‌యివేటుప‌రం చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు. విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఉద్య‌మాలు జ‌రుగుతున్నా ఎటువంటి స్పంద‌న ఉండ‌టంలేదు. అవ‌స‌ర‌మైతే ప్ర‌జ‌ల‌గొంతు నొక్కి మ‌రీ ప్ర‌యివేటుకు ధారాద‌త్తం చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడం కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌నే విమ‌ర్శ‌లు రోజురోజ‌కూ పెరిగిపోతున్నాయి.

25 శాతం విలువ‌కే క‌ట్ట‌బెడుతున్నారు
ప్ర‌భుత్వ రంగం సంస్థ‌ల‌ను అమ్మ‌డంలో కేంద్రం ఒక వ్యూహం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తోంది. దేశాన్ని రెండుగా విభ‌జించారు. ఉత్త‌ర భార‌త‌దేశాన్ని ముఖేష్ అంబానీకి, ద‌క్షిణ భార‌త‌దేశాన్ని అదానీకి క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్న‌మంటూ ప్ర‌జాసంఘాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వ్య‌వ‌సాయాన్ని కార్పొరేట్ల‌కు క‌ట్ట‌బెట్టే వ్యూహంలో భాగ‌మే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలంటూ రైతు సంఘాల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల వాస్తవ విలువలో 25 - 30 % విలువకే  ప్రైవేట్ వ్య‌క్తుల‌కు కట్టబెడుతుండడం...  ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కేయడం మోడీ ప్రభుత్వానికి రివాజుగా మారిపోయింది. దీన్ని అడ్డుకోక‌పోతే అన్ని ప్ర‌భుత్వ ఆస్తులు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు.. వాటి అధీనంలో ఉన్న విలువైన భూముల కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయ‌ని మేధావులు ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌జాచైత‌న్యం, ప్ర‌జా ఉద్య‌మ‌మే దీనికి ప‌రిష్కార‌మంటున్నారు.




రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్ కు కష్టమే!

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

టీనేజ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తారలు వీళ్లే..!?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>