EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-cbi-naidu-cid-amaravati-vizag-high-court-modcec58bdc-7b68-4903-8406-00a75117c233-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan-cbi-naidu-cid-amaravati-vizag-high-court-modcec58bdc-7b68-4903-8406-00a75117c233-415x250-IndiaHerald.jpgజగన్ పైన మోపిన కేసుల్లో మంత్రులకు సంబంధం లేదు. పోనీ ఐఏఎస్ అధికారులకు సంబంధం ఉందా అంటే అదీ తేలలేదు. క్విడ్ ప్రోకో అనే పదాన్ని మొదటసారి దర్యాప్తు సంస్ధతో పాటు ఎల్లోమీడియా కూడా బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. పోనీ ఒక్క కేసులో అయినా క్విడ్ ప్రోకో పద్దతిని రుజువు చేశారా అంటే ఇంతవరకు జరగలేదు. పోనీ జగన్ వల్ల తాము నష్టపోయామని ఎవరైనా ఫిర్యాదు చేశారా అంటే అదీలేదు. 2004-09 మధ్యలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఎవరికీ బాధ్యత లేదు. ఎవరు అవినీతికి పాల్పడినట్లు రుజువుల్లేవు. మరి మంత్రులకు సంబంధం లేక, పోనీ ఐఏఎస్ అjagan cbi naidu cid amaravati vizag high court mod;cbn;jeevitha rajaseskhar;jagan;amaravati;scheduled caste;chief minister;cbi;mantraహెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?jagan cbi naidu cid amaravati vizag high court mod;cbn;jeevitha rajaseskhar;jagan;amaravati;scheduled caste;chief minister;cbi;mantraThu, 18 Mar 2021 03:00:00 GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అప్పుడెప్పుడో అంటే సుమారు 11 ఏళ్ళ క్రితం అక్రమాస్తుల విచారణ పేరుతో సీబీఐ జగన్మోహన్ రెడ్డికి నోటీసులిచ్చింది. మూడు నాలుగు రోజుల విచారణ తర్వాత హఠాత్తుగా అరెస్టుని ప్రకటించారు. అంతే కాస్తా కూస్తా కాదు ఏకంగా 16 మాసాలు జగన్ జైలులోనే ఉండిపోయారు. ఎన్నిసార్లు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నా ఏవోవే కారణాలు చూపించి బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. చివరాఖరుకు 16 మాసాల జైలు జీవితం తర్వాత బెయిల్ దొరికింది. మరి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎంతవరకు వచ్చిందని మాత్రం అడక్కూడదు.




జగన్ పైన మోపిన కేసుల్లో మంత్రులకు సంబంధం లేదు. పోనీ ఐఏఎస్ అధికారులకు సంబంధం ఉందా అంటే అదీ తేలలేదు. క్విడ్ ప్రోకో అనే పదాన్ని మొదటసారి దర్యాప్తు సంస్ధతో పాటు ఎల్లోమీడియా కూడా బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. పోనీ ఒక్క కేసులో అయినా క్విడ్ ప్రోకో పద్దతిని రుజువు చేశారా అంటే ఇంతవరకు జరగలేదు. పోనీ జగన్ వల్ల తాము నష్టపోయామని ఎవరైనా ఫిర్యాదు చేశారా అంటే అదీలేదు. 2004-09 మధ్యలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఎవరికీ బాధ్యత లేదు. ఎవరు అవినీతికి పాల్పడినట్లు రుజువుల్లేవు. మరి మంత్రులకు సంబంధం లేక, పోనీ ఐఏఎస్ అధికారుల ఇన్వాల్వ మెంటూ లేకపోతే ఏ విధమైన అధికార పదవుల్లో లేని జగన్ అవినీతికి ఎలా పాల్పడ్డాడు ? అన్నదే ఆశ్చర్యం.




సరే ఆ విషయాన్ని వదిలేస్తే ఇఫుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులిచ్చింది. అదికూడా అమరావతి ప్రాంతంలో  అసైన్డ్ భూముల కుంభకోణం ఆరోపణలపై. ఎస్సీ, ఎస్టీలకు అప్పుడెప్పుడో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను చంద్రబాబునాయడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో స్వాధీనం చేసుకున్నది. ఇందులో ఆరోపణలకన్నా వాస్తవమే ఎక్కువుంది. ఎందుకంటే అసైన్డ్ భూములను తీసుకునే హక్కు ఎవరికీ లేదు. చివరకు ముఖ్యమంత్రి స్ధాయిలో కూడా అసైన్డ్ భూములను తీసుకునేందుకు నిర్ణయం చేసేందుకు లేదు. అసైన్డ్ భూముల విషయంలో మినహాయింపులు, సడలింపులు చేయాలంటే అది రాష్ట్రపతి మాత్రమే చేయగలరు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబును జగన్ సర్కార్ గట్టిగానే తగులుకునేట్లుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.




ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?

జమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>